Sunday, 29 December 2019

మహేష్ సినిమా అందుకే ఫ్లాపైంది.. ఎన్టీఆర్‌కు కథ చెప్పింది నిజమే!

సౌత్‌ స్టార్‌ డైరెక్టర్‌ మురుగదాస్ తొలిసారిగా సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ను డైరెక్ట్‌ చేసిన సినిమా దర్బార్‌. త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్‌ కార్యక్రమాలు భారీగా జరుగుతున్నాయి. ఇప్పటికే టీజర్‌, ట్రైలర్‌లతో పాటు లిరికల్‌ వీడియోలతో సినిమా మీద అంచనాలు తారా స్థాయికి చేరాయి. వరుస ప్రెస్‌మీట్‌లు ఇంటర్వ్యూలతో ఈ అంచనాలను మరింతగా పెంచేస్తున్నారు చిత్రయూనిట్‌. తాజాగా ప్రమోషన్‌లో భాగంగా మీడియాతో మాట్లాడిన దర్శకుడు మురుగదాస్‌ ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. తెలుగులో స్టాలిన్‌, స్పైడర్‌ రెండు సినిమాలు చేసిన మురుగదాస్‌ ఆ రెండు సినిమాల పరాజయానికి తానే కారణమన్నాడు. తెలుగు ప్రేక్షకుల పల్స్‌ తెలుసుకోలేకపోయానని తెలిపాడు. స్పైడర్‌ విషయంలో మహేష్‌ను తమిళ ఆడియన్స్‌కు పరిచయం చేయాలనుకున్నానే తప్ప తెలుగు ప్రేక్షకులు మహేష్‌ను ఎలా చూడాలనుకుంటున్నారో పట్టించుకోలేదన్నాడు. Also Read: అంతేకాదు గతంలో ఎన్టీఆర్‌ హీరోగా మురుగదాస్‌ దర్శకత్వంలో ఓ సినిమా అంటూ వార్తలు వినిపించాయి. ఈ వార్తలపై స్పందించిన మురుగదాస్‌.. చాలా రోజులుగా కిందట ఎన్టీఆర్‌కు కథ చెప్పిన మాట వాస్తవమే అన్నాడు. అయితే ఆ ప్రాజెక్ట్ వర్క్‌ అవుట్ కాలేదని ప్రస్తుతం అయితే ఎన్టీఆర్‌తో సినిమా చేస్తున్నట్టుగా వస్తున్న వార్తలన్ని అవాస్తవం అన్నాడు. అంతేకాదు త్వరలో ఓ తెలుగు సినిమాను డైరెక్ట్‌ చేయనున్నాని చెప్పాడు మురుగదాస్‌. రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన దర్బార్‌ సినిమా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. రజనీకాంత్‌ రూత్‌లెస్‌ బ్యాడ్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా నటిస్తున్న ఈ సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది. Also Read:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2SLxtl1

No comments:

Post a Comment

'I Wanted Waheeda Rehman For Ankur'

'I don't think Waheeda had the confidence that I could pull it off, so she said no.' from rediff Top Interviews https://ift.tt...