Saturday, 28 December 2019

రామ్‌ చరణ్‌ భార్యకు అక్కినేని అమల ఛాలెంజ్‌

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో అన్ని వర్గాల వారు భాగస్వాములు అవుతున్నారు. ప్రభుత్వాధికారులతో పాటు పలువురు సెలబ్రిటీలు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యేందుకు ముందుకు వస్తున్నారు. కార్యక్రమంలో పాల్గొన్నవారు తమ సన్నిహితులను భాగస్వాములయ్యేందుకు ఆహ్వానిస్తున్నారు. అందులో భాగంగా తాజాగా నటి అమల గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించారు. మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కూమార్ (IAS) ఇచ్చిన ఛాలెంజ్‌ను స్వీకరించిన అమల శనివారం తన నివాసంలో 5 మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సంస్థను ఆమె అభినందించారు. అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ నూతన సంవత్సరంలో అందరూ మొక్కలు నాటాలని అమల పిలుపునిచ్చారు. ఎప్పుడు సామాజిక కార్యక్రమాల్లో బిజీగా ఉండే అమల ఇటీవల నటన మీద దృష్టి పెట్టారు. వెబ్‌ సిరీస్‌లతో పాటు అడపాదడపా సినిమాల్లోనూ సటిస్తున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/360Dwpo

No comments:

Post a Comment

'Child Marriage Is Nothing But Child Rape'

'People don't believe that a 15-year-old girl subjected to sexual intercourse within a marriage is a victim of rape.' from red...