Monday, 30 December 2019

సరిలేరు నీకెవ్వరు.. అనిల్ రావిపూడి సెంటిమెంట్ కలిసొస్తుందా!

యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్నారు. 2019లో ‘ఎఫ్2’ సినిమాతో ఆయన బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఆ సినిమా విజయంతో స్టార్ నిర్మాతలు, హీరోల దృష్టిని తనవైపు తిప్పుకున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబును తన కథతో మెప్పించగలిగారు. మళ్లీ సంక్రాంతి రేసులో నిలబడ్డారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతోన్న ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా ఈ సంక్రాంతికి విడుదలవుతోంది. జనవరి 11న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే సినిమాకు మంచి ప్రచారం కల్పిస్తున్నారు. సాగర నగరం విశాఖపట్నంలో ఈనెల 28న నిర్వహించిన విశాఖ ఉత్సవ్‌లో ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రచార కార్యక్రమం చేపట్టారు. ఈ సినిమాలోని ‘డాంగ్ డాంగ్’ సాంగ్ ప్రోమోను విశాఖ ఉత్సవ్‌లో విడుదల చేశారు. మంత్రి అవంతి శ్రీనివాస్ ఈ ప్రోమోను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్, డైరెక్టర్ అనిల్ రావిపూడి, నటకిరీటి డా. రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. ఈ పాటకు వీరంతా స్టేజ్‌పై స్టెప్పులేశారు. అయితే, ఈ సాంగ్ ప్రోమో విడుదల కార్యక్రమాన్ని విశాఖ ఉత్సవ్‌లో నిర్వహించడానికి ఒక కారణం ఉంది. కిందటేడాది సంక్రాంతికి వచ్చిన అనిల్ రావిపూడి చిత్రం ‘ఎఫ్2’ ఆడియో విడుదల కార్యక్రమాన్ని కూడా విశాఖ ఉత్సవ్‌లో నిర్వహించారు. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు ‘సరిలేరు నీకెవ్వరు’కు కూడా అదే సెంటిమెంట్‌ను అనిల్ రావిపూడి ఫాలో అయినట్టున్నారు. ఆయన మాటల్లో కూడా ఇదే పరమార్థం కనిపించింది. ‘‘గత సంవత్సరం ఇదే సమయానికి ‘ఎఫ్2’ సినిమా కోసం విశాఖ ఉత్సవ్‌కి వచ్చి సక్సెస్ అయ్యాం. ఆ సినిమాని ఎంత పెద్ద సక్సెస్ చేశారో నేను ఎప్పటికి మర్చిపోలేను. ఈ సంవత్సరం కూడా ఈ ఉత్సవ్‌కి వచ్చి ‘సరిలేరు నీకెవ్వరు’ నుంచి డాంగ్ డాంగ్ సాంగ్ ప్రోమో లాంచ్ చేశాం. దేవీ శ్రీ ప్రసాద్ ఈ సినిమాకి ఫస్ట్ జడ్జ్. ఆయనిచ్చిన ఫీడ్ బ్యాక్ నేనెప్పుడూ మరువలేను. సినిమా చాలా బాగా వచ్చింది’’ అని అనిల్ చెప్పిన మాటలు సినిమాపై ఆయన కాన్ఫిడెన్స్‌కు అద్దం పడుతున్నాయి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/358jSqj

No comments:

Post a Comment

'Please Save My Mum'

'Doctors feel they have a duty to prolong a heartbeat at all costs.' from rediff Top Interviews https://ift.tt/2TnvHrW