Sunday 29 December 2019

హాఫ్ మిలియన్ కొట్టిన సాయి తేజ్.. యూఎస్‌లో తొలిసారి

సరైన హిట్టు కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తోన్న సుప్రీం హరో సాయిధరమ్ తేజ్ ఎట్టకేలకు తన విజయ దాహాన్ని తీర్చుకున్నారు. ‘ప్రతిరోజూ పండగే’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని మళ్లీ ఫాంలోకి వచ్చారు. ఈ సినిమా 9 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 22 కోట్ల షేర్‌ను రాబట్టింది. ఇప్పటికీ బాక్సాఫీసు వద్ద వసూళ్ల వేటను కొనసాగిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యూఎస్ బాక్సాఫీసు వద్ద కూడా సత్తా చాటుతున్నారు తేజూ. తన కెరీర్‌లో మొదటిసారి యూఎస్ బాక్సాఫీసు వద్ద హాఫ్ మిలియన్ డాలర్ మార్క్‌ను అందుకున్నారు. యూఎస్ బాక్సాఫీసు వద్ద ‘ప్రతిరోజూ పండగే’ సినిమా శనివారం నాటికి 529,600 డాలర్ల గ్రాస్ వసూలు చేసింది. అంటే, ఇండియన్ కరెన్సీ ప్రకారం సుమారు రూ. 3.78 కోట్లు. యూఎస్ హాఫ్ మిలియన్ డాలర్లను కలెక్ట్ చేసిన తొలి సాయిధరమ్ తేజ్ సినిమా ఇది. అక్కడ భారీ విజయం అందుకున్న ఈ సినిమా ఓవర్సీస్ బయ్యర్స్‌కు మంచి లాభాలను తెచ్చిపెట్టింది. ఈ సినిమాతో యూఎస్‌లోనూ సాయి తేజ్ మంచి మార్కెట్‌ను ఏర్పరుచుకున్నారు. ఇకపై ఆయన సినిమాలకు అక్కడ కూడా మంచి డిమాండ్ ఉంటుంది. కాగా, రాశీ ఖన్నా హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో సత్యరాజ్, రావు రమేష్ కీలక పాత్రలు పోషించారు. శ్రీకాంత్, హరితేజ, సత్యం రాజేష్, అజయ్, మహేష్, విజయ్ కుమార్, ప్రభ తదితరులు నటించారు. మారుతి దర్శకత్వంలో వహించిన ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పణలో యూవీ క్రియేషన్స్, జీఏ2 పిక్చర్స్ బ్యానర్లపై బన్నీ వాస్ నిర్మించారు. ఎస్కేఎన్ సహనిర్మాత. తమన్ ఎస్ సంగీతం సమకూర్చారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2ryrtR8

No comments:

Post a Comment

'Don't Involve My Family!'

'My weakness is my family, and the people I love.' from rediff Top Interviews https://ift.tt/2lOucDz