Sunday, 29 December 2019

Naina Ganguly: `ఈ `బ్యూటీఫుల్‌` అందాలని ఇలా ఎప్పుడు చూశావయ్యా`

సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మ తన సినిమాలకు సోషల్ మీడియా ద్వారానే కావాల్సినంత ప్రచారం చేసుకుంటాడు. ఇటీవల ఎక్కువగా వివాదాస్పద చిత్రాలనే రూపొందిస్తున్న వర్మ తాజాగా ఓ సెన్సిబుల్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. తన శిష్యుడు అగస్త్య మంజు దర్శకత్వంలో తెరకెక్కిన బ్యూటీఫుల్ సినిమాకు తనదైన స్టైల్‌లో ప్రచారం చేస్తున్నాడు. ఇటీవల అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమాలతో ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన వర్మ ఆశించిన విజయం మాత్రం సాధించలేకపోయాడు. ఈ సినిమా క్వాలిటీ, కంటెంట్‌ పరంగా నిరాశపరచటంతో వర్మ సృష్టించిన వివాదాలన్ని వృధా అయ్యాయి. తాజాగా బోల్డ్‌ కంటెంట్‌తో తెరకెక్కిన బ్యూటీఫుల్‌ను తలకెక్కుకున్నాడు వర్మ. Also Read: న్యూ ఇయర్‌ కానుకగా జనవరి 1న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. వర్మ ఆస్థాన నటి నైనా గంగూలి కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికర ట్వీట్‌లు చేస్తున్నాడు వర్మ. `మా `బ్యూటిఫుల్` టీం ప్రీ న్యూ ఇయర్ పార్టీ లో నాతో, నైనా గంగూలీ తో, పార్థ సూరి తో, అగస్త్య మంజు తో కలిసి వోడ్కా తాగండి.... ఎలాగంటే Facebook, instagram ద్వారా ఈరోజు 29 రాత్రి 8.45 నుంచి లైవ్ స్ట్రీమింగ్ లో మా ప్రైవేట్ పార్టీకి పబ్లిక్ అందరూ ఆహ్వానితులే` అంటూ ట్వీట్ చేసి ఆడియన్స్‌ను కన్‌ఫ్యూజ్‌ చేశాడు వర్మ. కాసేపటి హీరోయిన్‌ నైనా గంగూలి వంగవీటి సినిమాలో పోషించిన కుమారి పాత్రకు సంబంధించిన సీన్స్‌, తాజాగా బ్యూటీఫుల్‌ సినిమాలో సీన్స్‌ను కలిపి రూపొందించిన వీడియోను తన సోషల్ మీడియా పేజ్‌లో పోస్ట్ చేసిన వర్మ.. `సూపర్ సీరియస్ వంగవీటి కుమారి లో ఈ “బ్యూటిఫుల్” అందాలని ఇలా ఎప్పుడు చూసావయ్యా అగస్త్య మంజు??????` అంటూ కామెంట్ చేశాడు`.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2tW01xy

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....