Thursday, 26 December 2019

చొక్కా విప్పుతూ రామ్ వీడియో... అబ్బ హాలీవుడ్ హీరోలకు ఏమాత్రం తీసిపోడు

ఎనర్జిటిక్ స్టార్ తన సత్తా ఏంటో ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో మరోసారి నిరూపించారు. అప్పటివరకు లవర్ బాయ్‌గా ప్రేక్షకులను మెప్పించిన రామ్.. పూరీ జగన్నాథ్ చేతిలో పడ్డాక తన బోల్డ్‌నెస్‌ను పరిచయం చేశారు. వీరిద్దరిదీ కొత్త కాంబినేషన్‌ కావడంతో బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని మరే సినిమా ఆపలేకపపోయింది. ఇప్పుడు రామ్ తన కొత్త ప్రాజెక్ట్‌తో బిజీగా ఉన్నారు. ‘రెడ్’ అనే సినిమాలో నటిస్తున్నారు. తిరుమల కిశోర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ సినిమాలో రామ్ మైండ్ బ్లోయింగ్ ఫైటింగ్ సన్నివేశాల్లో నటించారట. READ ALSO: ప్రముఖ స్టంట్ కొరియోగ్రాఫర్ పీటర్ హీన్స్ ఈ ఫైట్స్‌ని కొరియోగ్రాఫ్ చేశారు. ఫైట్స్ చాలా రఫ్‌గా ఉండటంతో రామ్ జబ్బలకు స్వల్పంగా గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో రామ్ సోషల్ మీడియలో ఓ వీడియోను పోస్ట్ చేశారు. ‘డియర్ పీటర్ హీన్.. మీకు నాపై ఎంత ప్రేమ ఉందో నేను చూడలేను కానీ ఫీలవ్వగలను. అచ్చం మీరు పెట్టే బాధలాగే. సినిమాకు సంబంధించిన కొన్ని సన్నివేశాలు చూశాను. దిమ్మ తిరిగిపోయింది’ అని రామ్ పేర్కొంటూ చొక్కా విప్పి చూపించారు. ఈ వీడియో చూడగానే ఫ్యాన్స్ కామెంట్స్ సెక్షన్‌ను నింపి పడేస్తు్న్నారు. ‘హాలీవుడ్ హీరోకు ఏమాత్రం తీసిపోవు అన్నా. నేను ఈ వీడియోను ఎందుకు తీస్తున్నానంటే మీకు నేను దూరంగా లేను అని చెప్పడానికి’ అంటూ తెగ ప్రశంసలు కురిపించేస్తున్నారు. స్రవంతి మూవీస్ బ్యానర్‌పై ‘స్రవంతి’ రవికిషోర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం సమకూరుస్తున్నారు. READ ALSO: ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడమే కాకుండా మళ్లీ ఫుల్ ఫామ్‌లోకి వచ్చిన రామ్.. తనతో ‘నేను శైలజ’, ‘ఉన్నది ఒక్కటే జిందగీ’ వంటి క్లాసికల్ మూవీస్ తీసిన తిరుమల కిషోర్‌ను నమ్ముకున్నారు. అయితే అక్టోబర్‌లో విడుదలైన ఈ సినిమా పోస్టర్లు చూస్తుంటే ఇది మంచి మాస్ మూవీలా అనిపిస్తోంది. అందుకే, ఈ సినిమా ఓపెనింగ్‌కు మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌కు అతిథిగా తీసుకొచ్చారు. ఇదిలా ఉంటే, ‘రెడ్’ సినిమా షూటింగ్ నవంబర్ 16న మొదలైంది. నాన్ స్టాప్‌గా షూటింగ్ జరిపి ఏప్రిల్ తొలివారంలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నామని నిర్మాత ‘స్రవంతి’ రవికిషోర్ చెప్పారు. తమ బ్యానర్‌లో ఇదొక విభిన్నమైన చిత్రం అవుతుందని తెలిపారు. ఇది తమిళ చిత్రం ‘తడమ్’కు రీమేక్ అనే వార్తలు వస్తున్నాయి. దీనిపై రవికిషోర్ స్పందిస్తూ.. పూర్తి రీమేక్ కాదని, స్టోరీ లైన్‌ను తీసుకొని చాలా మార్పులు చేశామని అన్నారు. సినిమా టైటిల్ మాదిరిగానే కథ, కథనం కూడా చాలా కొత్తగా ఉంటాయని దర్శకుడు తిరుమల కిషోర్ వెల్లడించారు. ఇదొక కమర్షియల్ థ్రిల్లర్ అని చెప్పారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2QhLLH7

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....