Sunday, 29 December 2019

Bheeshma: నితిన్‌, రష్మికకు కృతజ్ఞతలు తెలిపిన హృతిక్‌ రోషన్‌

వరుస ఫ్లాప్‌లతో ఇబ్బందుల్లో ఉన్న యంగ్ హీరో లాంగ్‌ గ్యాప్‌ తరువాత చేస్తున్న సినిమా భీష్మ. ఇప్పటికే చిత్రీకరణ చివరి దశకు చేరుకున్న ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్‌ కార్యక్రమాలు ప్రారంభించారు చిత్రయూనిట్. టీజర్‌తో పాటు వరుసగా లిరికల్‌ వీడియోలను రిలీజ్ చేస్తున్నారు. ఇటీవల పోసిటానాలో షూటింగ్ జరుగుతుండగా నితిన్‌, రష్మికలు ఓ వీడియోను తమ సోషల్‌ మీడియా పేజ్‌లో షేర్‌ చేశారు. హృతిక్‌ నటించిన గుంగ్రూ పాటకు నితిన్‌, రష్మికలు కలిసి డ్యాన్స్‌ చేసి ఆ వీడియోను హృతిక్‌ను ట్యాగ్‌ చేస్తూ ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. `భీష్మ టీం తరపున మీకు ప్రేమతో హృతిక్‌ సర్‌. ఆడియో సరిగ్గా సింక్‌ అవ్వలేదు క్షమించాలి` అంటూ ట్వీట్ చేశాడు. Also Read: అయితే ఈ వీడియోపై స్పందించాడు. తన ట్విటర్‌ వేదికగా నితిన్‌, రష్మిక మందన్నలకు కృతజ్ఞతలు తెలియజేశాడు. అంతేకాదు నితిన్‌, రష్మికలతో పాటు భీష్మ టీ మొత్తానికి ఆల్‌ ద బెస్ట్‌ అంటూ ట్వీట్ చేశాడు నితిన్‌. వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న భీష్మ సినిమాను సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు. ఈ సినిమా 2020 ఫిబ్రవరిలో విడుదల కానుంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2SAUJlB

No comments:

Post a Comment

'I Wanted Waheeda Rehman For Ankur'

'I don't think Waheeda had the confidence that I could pull it off, so she said no.' from rediff Top Interviews https://ift.tt...