Friday, 27 December 2019

Megastar: చిరంజీవిని రాష్ట్రపతిగా చూడలట.. స్క్రీన్‌ మీద కాదు రియల్‌ లైఫ్‌లో!

సామాన్యుడిగా వెండితెరకు పరిచయం అయి అసామాన్యుడిగా ఎదిగిన నటుడు మెగాస్టార్‌ . తన కృషి, పట్టుదలతో వెండితెర వేల్పుగా ఎదిగిన మెగాస్టార్‌ తరువాత రాజకీయాల్లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. తెర మీద చిరుకు నీరాజనాలు పట్టిన తెలుగు ప్రేక్షకులు, ఆయనకు రాజకీయ నాయకుడిగా మాత్రం ఆమోదం తెలపలేదు. దీంతో చిరు రాజకీయ ప్రయాణం అర్థాంతరంగా ఆగిపోయింది. ఎన్నో ఆశలు, ఆశయాలతో పెట్టిన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి, కొంత కాలం కేంద్రమంత్రిగా సేవలందించి తరువాత తిరిగి సినీరంగంలోకి అడుగుపెట్టాడు. రీ ఎంట్రీలోనూ తనదైన స్టైల్‌, మేనరిజమ్స్‌తో ఆకట్టుకున్న మెగాస్టార్‌ తన ఇమేజ్‌, కలెక్షన్‌ స్టామినా ఏ మాత్రం తగ్గలేదని ప్రూవ్ చేసుకున్నాడు. Also Read: అయితే ఇటీవల చిరు, బావమరిది అల్లు అరవింద్‌.. మెగాస్టార్‌ రాజకీయ భవిష్యత్తుపై ఆసక్తికర కామెంట్‌ చేశాడు. ఓ సీనియర్‌ జర్నలిస్ట్‌ కథనం మేరకు అల్లు అరవింద్‌, చిరంజీవిని రాష్ట్రపతిగా చూడాలనుకుంటున్నాడు. అంటే ఏదో సినిమాలో పాత్రలో కాదు. నిజంగా భారత దేశ ప్రథమ పౌరుడిగా చిరంజీవిని చూడాలన్నది కోరిక. `చిరంజీవి ఇంకా ఏ స్థాయికి ఎదగాలనుకుంటున్నారు ?` అనే ప్రశ్న అల్లు అరవింద్ ని అడిగితే ఆయన చెప్పిన సమాధానం. `రాజకీయాల్లో ఎంత స్థాయికి వెళ్తారనేది ఎవరూ ఊహించలేరు. కానీ నాకు మాత్రం ఆయన ప్రెసిడెంట్ అఫ్ ఇండియా అవ్వాలని ఉంది. ఆ అవకాశం ఉందని నేను నమ్ముతాను`. అని అరవింద్ చెప్పారు. ఈ మాటలు వింటుంటే చిరుకు రాజకీయాల మీద ఇంకా ఆశ ఉన్నట్టుగానే అనిపిస్తుంది. Also Read: ఇటీవల పాన్‌ ఇండియా సినిమాగా తెరకెక్కిన సైరా నరసింహారెడ్డితో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మెగాస్టార్‌ చిరంజీవి, ప్రస్తుతం కొరటాల శివ సినిమా కోసం రెడీ అవుతున్నాడు. ఇప్పటికే లాంచనంగా ప్రారంభమైన ఈ సినిమా జనవరిలో రెగ్యులర్‌ షూటింగ్‌కు వెళ్లనుంది. ఈ సినిమాలో యంగ్ లుక్‌లో కనిపించేందుకు బరువు తగ్గే పనిలో ఉన్నాడు మెగాస్టార్‌. ఈ మూవీలో చిరుకు జోడిగా అందాల భామ త్రిష నటించనుంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/355ZYMu

No comments:

Post a Comment

'Please Save My Mum'

'Doctors feel they have a duty to prolong a heartbeat at all costs.' from rediff Top Interviews https://ift.tt/2TnvHrW