Monday, 30 December 2019

Regina Cassandra: చిరుతో ఐటమ్‌ సాంగ్‌.. హాట్‌ బ్యూటీకి క్రేజీ ఆఫర్‌!

హీరోయిన్‌ ఎంట్రీ ఇచ్చి చాలా కాలం అవుతున్నా.. స్టార్‌ ఇమేజ్‌ అందుకోలేకపోయిన బ్యూటీ కాసాండ్ర. పర్ఫామెన్స్‌ ఓరియంటెడ్‌ రోల్స్‌లో పాటు గ్లామర్‌ క్యారెక్టర్స్‌కు కూడా సై అన్నా ఈ భామకు అవకాశలు మాత్రం రావటం లేదు. ఇటీవల ఎవరు సినిమాలో నెగెటివ్ రోల్‌లోనూ మెప్పించిన రెజీనాకు స్టార్‌ హీరోల సరసన ఛాన్స్‌ దక్కకపోయినా వరుస సినిమాలు చేస్తోంది. తాజాగా ఈ భామకు ఓ క్రేజీ ఆఫర్‌ తలుపు తట్టినట్టుగా తెలుస్తోంది. మెగాస్టార్‌ హీరోగా తెరకెక్కుతున్న 152వ సినిమాలో రెజీనా నటించనుంది. అయితే ఈ సినిమాలో రెజీనా నటించబోయేది ఓ ప్రత్యేక గీతంలో అన్న టాక్‌ వినిపిస్తోంది. సందేశాత్మక చిత్రాలను కమర్షియల్ ఫార్మాట్‌లో తెరకెక్కించే స్టార్‌ డైరెక్టర్‌ కొరటాల శివ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. Also Read: ఇటీవల లాంచనంగా ప్రారంభమైన ఈ సినిమా జనవరిలో రెగ్యులర్‌ షూటింగ్ ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాలో రెజీనా స్పెషల్‌ సాంగ్‌లో నటించనుందట. చిరుతో డ్యాన్స్‌ చేసే ఛాన్స్‌ రావటంతో రెజీనా కూడా స్పెషల్‌ సాంగ్‌కు వెంటనే ఒప్పేసుకుంది. గతంలో చిరు రీ ఎంట్రీ సినిమా ఖైదీ నంబర్‌ 150 షూటింగ్ సమయంలో ఇలాంటి రూమర్సే వినిపించాయి. ఆ సినిమాలో రెజీనా స్పెషల్ సాంగ్ చేస్తుందన్న ప్రచారం గట్టిగా వినిపించింది. అయితే ఫైనల్‌గా ఆ అవకాశం రాయ్‌ లక్ష్మీని వరించింది. ఇప్పుడు మరోసారి అదే తరహా వార్తలు రావటంతో ఎంత వరకు కరెక్ట్ అన్న అనుమానాలు కలుగుతున్నాయి. Also Read: ఈ సినిమాలో చిరంజీవి ద్విపాత్రాభినయం చేస్తున్నాడన్న టాక్‌ వినిపిస్తోంది. చాలా కాలం తరువాత చెన్నై చంద్రం త్రిషా, మెగాస్టార్‌కు జోడిగా నటిస్తోంది. ఈ సినిమాను మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్స్‌ సంస్థతో కలిసి మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ బ్యానర్‌పై నిర్మిస్తున్నాడు. చాలా కాలం తరువాత మణిశర్మ ఈ సినిమాతో మెగాస్టార్‌కు సంగీతమందిస్తున్నాడు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2MKAVIB

No comments:

Post a Comment

'I Wanted Waheeda Rehman For Ankur'

'I don't think Waheeda had the confidence that I could pull it off, so she said no.' from rediff Top Interviews https://ift.tt...