Saturday 28 December 2019

నయనతార, తాప్సీల బాటలో సమంత

కమర్షియల్ సినిమాలతో పాటు లేడీ ఓరియంటెడ్‌ సినిమాలతో ఆకట్టుకుంటున్న టాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్‌ సమంత. పెళ్లి తరువాత ఎక్కువగా నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు మాత్రమే చేస్తున్న ఈ బ్యూటీ ప్రస్తుతం 96 రీమేక్‌లో నటిస్తోంది. ఈ సినిమా తరువాత సమంత చేయబోయే సినిమా ఇంకా కన్‌ఫార్మ్‌ కాలేదు. అయితే సామ్‌ కొద్ది రోజులు బ్రేక్ తీసుకునే ఆలోచనలో ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా మరో ఇంట్రస్టింగ్ న్యూస్ తెర మీదకు వచ్చింది. 96 రీమేక్‌ తరువాత మరోసారి ఓ లేడీ ఓరియంటెడ్ సినిమాలో నటించేందుకు సమంత ఓకె చెప్పినట్టుగా తెలుస్తోంది. థ్రిల్లర్‌ జానర్‌లో లేడీ ఓరియంటెడ్ సినిమాలను తెరకెక్కించే తమిళ దర్శకుడు అశ్విన్‌ శరవణన్‌ సమంత ప్రధాన పాత్రలో ఓ సినిమా తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. Also Read: నయనతార ప్రధాన పాత్రలో మాయ, తాప్సీ లీడ్‌ రోల్‌లో గేమ్‌ ఓవర్ సినిమాలను తెరకెక్కించిన అశ్విన్‌.. సమంతతోనూ అదే జానర్‌లో ఓ సినిమాను రూపొందించే ఆలోచనలో ఉన్నాడు. ఇప్పటికే సమంతకు కథకూడా వినిపించినట్టుగా తెలుస్తోంది. అశ్విన్ చెప్పిన కథ నచ్చటంతో ఈ సినిమాలో నటించేందుకు ఓకె చెప్పేసినట్టుగా తెలుస్తోంది. See Photo Story: ఇప్పటికే 96 రీమేక్‌ షూటింగ్ పూర్తయ్యింది. తమిళ్‌లో త్రిష నటించిన జాను పాత్రను తెలుగులో సమంత పోషిస్తోంది. తమిళ వర్షన్‌కు దర్శకత్వం వహించిన ప్రేమ్‌కుమార్‌ తెలుగు వర్షన్‌ను కూడా డైరెక్ట్‌ చేస్తున్నాడు. ఈ సినిమాలో సమంతకు జోడిగా శర్వానంద్‌ నటిస్తున్నాడు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా జనవరిలో రిలీజ్‌కు రెడీ అవుతోంది. Also Read:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2tYUtT6

No comments:

Post a Comment

'Don't Involve My Family!'

'My weakness is my family, and the people I love.' from rediff Top Interviews https://ift.tt/2lOucDz