Thursday, 26 December 2019

ఒక్క పాత్రకు 11 అవార్డులు.. ఫుల్‌ జోష్‌లో సీనియర్‌ హీరోయిన్‌

ఇక కెరీర్‌ ముగిసిపోయిందనుకున్న దశలో తిరిగి ఫాంలోకి వచ్చిన సీనియర్‌ హీరోయిన్‌ ఇప్పుడు ఫుల్ జోష్‌లో ఎంజాయ్‌ చేస్తోంది. ఇటీవల ఈ భామ నటించిన `96` సినిమా ఘనవిజయం సాధించటమే కాదు త్రిష నటిగా ఎన్నో అవార్డులు తెచ్చిపెట్టింది. గత ఏడాది రిలీజ్‌ అయిన ఈ సినిమా ఏదో ఒక విధంగా ఇప్పటికీ వార్తల్లో నిలుస్తూనే ఉంది. తాజాగా 96 సినిమాకు సంబంధించి మరో ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది త్రిష. ఈ సినిమాలో త్రిష పోషించిన జాను పాత్రకు ఇప్పటి వరకు 11 అవార్డులు దక్కాయి. తాజాగా ఆ అవార్డులతో దిగిన ఫోటోను తన సోషల్‌ మీడియా పేజ్‌లో పోస్ట్ చేసిన త్రిష `నాకు వచ్చిన దీవెనలను లెక్కిస్తున్నా.. 96కు 11చ హేజూడ్‌కు 3. మీ ప్రేమకు కృతజ్ఞతలు` అంటూ ట్వీట్ చేసింది త్రిష. Also Read: విజయ్‌ సేతుపతి, త్రిష హీరో హీరోయిన్లుగా నటించిన 96 సినిమాకు సీ ప్రేమ్‌కుమార్‌ దర్శకుడు. 2018 అక్టోబర్‌ 4న రిలీజ్‌ అయిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. మాస్‌, కమర్షియల్ ఎలిమెంట్స్‌ లేకపోయినా విజయ్‌ సేతుపతి, త్రిషల నటన సినిమాకు హైలెట్‌గా నిలిచింది. దీంతో 96 ఆ ఏడాదిలో బిగ్గెస్ట్ బ్లాక్‌ బస్టర్స్‌లో ఒకటిగా నిలిచింది. Also Read: ప్రస్తుతం త్రిష ఆరు సినిమాలతో బిజీగా ఉంది. తమిళ్‌లో గర్జనై, పరమపదం విలయాట్టూ, రాంగీ, సుగర్‌, పొన్నియన్‌ సెల్వన్‌తో పాటు తెలుగులో మెగాస్టార్‌ కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమాలోనూ త్రిష హీరోయిన్‌గా నటించనుంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2tS3ai1

No comments:

Post a Comment

'I Wanted Waheeda Rehman For Ankur'

'I don't think Waheeda had the confidence that I could pull it off, so she said no.' from rediff Top Interviews https://ift.tt...