Sunday, 20 June 2021

Vignesh Shivan : నయన్‌లో నచ్చిన విషయం అదే.. ఇష్టాన్ని బయటపెట్టేసిన విఘ్నేశ్ శివన్

ప్రస్తుతం దక్షిణాది సినీ పరిశ్రమలో అందమైన ప్రేమ జంట ఎవరు? అంటే అందరూ నయన తార వైపే వేలు చూపిస్తుంటారు. అలా ఈ ప్రేమ పక్షులు చేసే సందడికి అంతా షాక్ అవుతుంటారు. స్పెషల్ ఫ్లైట్‌లో తన ప్రియుడిని తీసుకెళ్తుంటారు నయనతార. చెన్నై, కొచ్చి అంటూ ఇలా తిరుగుతూ ఉంటారు. మొన్నీ మధ్యే కొచ్చి నుంచి చెన్నైకి ఈ జంట వచ్చినట్టు తెలుస్తోంది. ఓనం, న్యూయర్ సెలెబ్రేషన్స్, అమ్మ బర్త్ డే సెలెబ్రేషన్స్ అంటూ ప్రియురాలితో విఘ్నేశ్ శివన్ చేసిన ఎంజాయ్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. అయితే ఈ ఇద్దరి ఫోటోలు, మ్యాటర్ మాత్రం సోషల్ మీడియాలో ఎప్పుడూ సెంటరాఫ్ అట్రాక్షన్‌గా మారుతుంటుంది. అలా నయన తార విఘ్నేశ్ శివన్‌ల పెళ్లి వ్యవహారం అయితే మీడియాలో ఎన్నో సార్లు వైరల్ అయింది. అదిగో పెళ్లి, ఇదిగో పెళ్లి అంటూ రకరకాల రూమర్లు వచ్చాయి. మధ్యలో కొన్ని సార్లు అయితే ఏకంగా విడిపోయారంటూ గాసిప్పులు పుట్టుకొచ్చేశాయ్. అయితే వాటిని నయన్ విఘ్నేశ్‌లు సరదాగా నవ్వుకుంటూ కొట్టిపారేశారు. మొన్నీ మధ్యే తమ పెళ్లి గురించి మీడియా రాసే వార్తలపై విఘ్నేశ్ కౌంటర్ వేశారు. ఇప్పటికే నయనతారకు మీడియా 22 సార్లు పెళ్లి చేసిందంటూ ఫేక్ న్యూస్‌ల మీద విఘ్నేశ్ సెటైర్ వేశారు. తాజాగా విఘ్నేశ్ శివన్ తన ఫాలోవర్లతో ముచ్చట్లు పెట్టారు. ఈ క్రమంలో నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు ఎంతో సహనంతో రిప్లై ఇచ్చారు. ఇక చాలామట్టుకు నయన్‌కు సంబంధించిన ప్రశ్నలే ఎదురయ్యాయి. నయనతారతో మీరు దిగిన ఫోటో, అందులో మీకు బాగా నచ్చిన ఫోటో ఏది అని ప్రశ్నించారు. ఇంకో నెటిజన్ అయితే.. నయన్‌లో ఏ లక్షణం మీకు చాలా ఇష్టమని అడిగేశాడు. అలా నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు విఘ్నేశ్ ఇచ్చిన సమాధానాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. నయనతారలోని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ (తన మీద తనకు నమ్మకం) నాకు చాలా ఇష్టమని విఘ్నేశ్ శివన్ బధులిచ్చారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3cVsS8W

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....