Saturday, 26 June 2021

Poonam Kaur : ఇప్పటికైనా అది నేర్చుకో.. కత్తి మహేష్‌కు ప్రమాదంపై పూనమ్ కౌర్ పరోక్ష సెటైర్!

సినీ క్రిటిక్, నటుడు కత్తి మహేష్‌కు రోడ్డు ప్రమాదం జరిగిన వార్తలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ప్రమాదంపై కొందరు సెటైర్లు వేస్తున్నారు. మరీ ముఖ్యంగా జన సైనికులు కౌంటర్లు వేస్తున్నారు. అయితే తాజాగా వేసిన ఓ ట్వీట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇది కచ్చితంగా కత్తి మహేష్‌కు జరిగిన ప్రమాదం మీదే అయి ఉంటుందని కామెంట్లు పెడుతున్నారు. ఇంతకీ పూనమ్ కౌర్ వేసిన ట్వీట్ సారాంశం ఏంటో, కత్తి మహేష్‌కు ప్రమాదం ఎలా జరిగిందనేది ఓ సారి చూద్దాం. కొడవలూరు మండలం చంద్రశేఖరపురం దగ్గర జాతీయ రహదారిపై మహేష్ ప్రయాణిస్తున్న ఇన్నోవా కారు అదుపుతప్పి ముందు వెళ్తున్న కంటెనర్‌ను ఢీకొట్టింది. వెంటనే కారులో ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో కత్తి మహేష్‌ ప్రమాదం తప్పి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. శుక్రవారం అర్ధరాత్రి సమయంలోఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాద సమాచారం తెలుసుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. వెంటనే ఆయన్ని నెల్లూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంలో కత్తి మహేష్‌ కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసం అయ్యింది. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కత్తి మహేష్‌ది సొంత జిల్లా చిత్తూరు. అక్కడి నుంచి హైదరాబాద్ వెళుతుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ వ్యవహారంపైనే పూనమ్ కౌర్ స్పందించినట్టు తెలుస్తోంది. రాముడిని, సీతని నీ అవసరానికి ఇష్టమొచ్చినట్టుగా వాడుకున్నావ్, వదిలేశావ్ ఏళ్ల నుంచి పద్దతిగా తన పని తాను చేసుకునే బ్రహ్మణ అమ్మాయిని.. నువ్ ప్రాణాలతో బయటపడాలని కోరుకుంటున్నాను.. ఎందుకంటే ఇకనైనా అసలు జీవితాన్ని చూస్తావ్ అని. ఇప్పటికైనా అమ్మాయిలను, అమ్మని గౌరవించడం నేర్చుకో జై శ్రీరామ్ అని పూనమ్ కౌర్ ట్వీట్ వేశారు. అయితే నెటిజన్లు మాత్రం అది గురించేనని అంటున్నారు. మరి దీనిపై పూనమ్ కౌర్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. కత్తి మహేష్ పవన్ కళ్యాణ్ పూనమ్ కౌర్ వ్యవహారం ఒకప్పుడు మీడియాలో ఎంతటి సెన్సేషన్‌కు దారి తీసిందో అందరికీ తెలిసిందే.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3A2Bzby

No comments:

Post a Comment

'Congress Has Many Capable Leaders...'

'Maybe this has created some minor issues which can happen in any party.' from rediff Top Interviews https://ift.tt/lRkZP1O