Wednesday, 30 June 2021

Crrush: ఆ మూడు జంటలను నగ్నంగా బంధించిన డైరెక్టర్.. అలా వర్కవుట్ కాకపోవడంతో ఇలా!

నటుడిగా, దర్శకుడిగా తనదంటూ ప్రత్యేకమైన దారి అంటూ దూసుకుపోతున్నారు . సీనియర్ నటుడు చలపతి రావు వారసుడిగా ఎంట్రీ ఇచ్చి సినీ రంగంలో ఓ మార్క్ క్రియేట్ చేసుకున్న ఆయన, విభిన్నమైన కథాంశాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇటీవలే 'ఆవిరి' సినిమాతో అట్రాక్ట్ చేసిన ఆయన ఈ సారి అడల్ట్ కామెడీ మూవీ ''తో రెడీ అయ్యారు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ ఓ అడల్ట్ పోస్టర్ రిలీజ్ చేశారు. తన సొంత బ్యానర్ ఫ్లైయింగ్ ఫ్రాగ్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ కోసం అంతా పక్కాగా ప్లాన్ చేసుకున్నారు రవిబాబు. యూత్‌కి కనెక్ట్ అయ్యేలా 'క్రష్' అనే టైటిల్‌తో వస్తున్న ఆయన, అదే రేంజ్‌లో ప్రమోషన్స్ చేస్తున్నారు. బాత్‌రూమ్‌లో స్నానం చేస్తూ కాళ్లపై ఉన్న వెంట్రుకలను షేవ్ చేసుకుంటున్న అమ్మాయిని, డోర్ పక్కనే ఉండి మాస్క్ ధరించి అదంతా చూస్తున్న ముగ్గురు అబ్బాయిలను చూపిస్తూ గతంలో పోస్టర్స్ వదిలిన రవిబాబు ఈ సారి ఏకంగా మూడు జంటలను నగ్నంగా బందీ చేసిన ఫొటో రిలీజ్ చేశారు. ఇక రీసెంట్‌గా విడుదలైన ఈ సినిమా టీజర్ ఆన్ లైన్ వేదికలపై ఓ రేంజ్‌లో రచ్చ చేసింది. అర్థనగ్న సన్నివేశాలు, డబుల్ మీనింగ్ డైలాగ్స్‌తో నానా హంగామా చేసేసింది. ఈ క్రమంలో ఇటీవల సెన్సార్‌కి వెళ్ళిన ఈ చిత్రంలో అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయనే కారణంతో కొన్ని కండీషన్స్ పెట్టారట. అయితే దానికి అంగీకరించని రవిబాబు.. నేరుగా ఓటీటీ వేదికపై ఈ సినిమా రిలీజ్ చేసేలా ప్లాన్ చేశారు. ఈ మేరకు జీ 5 సంస్థతో ఒప్పందం చేసుకొని జూలై 9వ తేదీ స్ట్రీమింగ్ కాబోతోందని ప్రకటించారు. రవిబాబు స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ సినిమాలో అభయ్ సింహా, కృష్ణ బూరుగుల, చరణ్‌ సాయి, అంకిత మనోజ్, పాండే, శ్రీసుధా రెడ్డి ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. సో.. పోస్టర్స్, టీజర్ వీడియోలే ఈ రేంజ్ కిక్కిచ్చాయంటే ఇక సినిమా ఏ రేంజ్‌లో ఉంటుందనేది చూడాలి మరి!.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2TgnBCt

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....