Saturday 26 June 2021

MAAలో గొడవలే నేర్చుకున్నా.. వచ్చేవాళ్లు బాహుబలిలా రావొద్దు: శివ బాలాజీ స్ట్రాంగ్ రియాక్షన్

మేం ‘మా’కి ఏం చేయలేదని అటుంటే చాలా బాధగా ఉందని అన్నారు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ, సినీ నటుడు శివ బాలాజీ. ‘మా’ ఎన్నికల నేపధ్యంలో తమపై వచ్చిన ఆరోపణలు.. భవిష్యత్ కార్యచరణపై ప్రస్తుత ‘మా’ అధ్యక్షుడు శనివారం నాడు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శివ బాలాజీ మాట్లాడుతూ.. ‘నేను మాట్లాడే మాటలు మా సభ్యులకు సంబంధించినవి మాత్రమే. దయచేసి జనం వీటిని భరించండి. మేం ఈ రెండేళ్లలో చేసింది చెప్పాలంటే మూడు గంటలపైనే టైం పడుతుంది. మా మెంబర్స్ అంతా గమనించాలి మేం చేసింది అంతా ఆఫీస్‌లో రికార్డ్ అయ్యి ఉంది. ఆ లిస్ట్ కావాలంటే ఎవరికైనా ఇస్తాం. నేను జాయింట్ సెక్రటరీగా చేశాను.. నరేష్ గారే నన్ను ఇన్వైట్ చేశారు. నేను మాలో పోటీ చేయడానికి నరేష్ గారే కారణం. జాయింట్ సెక్రటరీగా పోటీ చేయమన్నారు. పోటీ చేశాను గెలిచాను. నేను జాయింట్ సెక్రటరీగా ఎన్నికైన తరువాత తొలి మూడు నెలలు ఇక్కడ ఏం జరుగుతుంది అని గమనించాను. నేను అక్కడ ఫస్ట్ నేర్చుకున్నది ఏంటి అంటే.. గొడవలే. ఎందుకంటే డిఫరెంట్ ఒపీనియన్స్.. నేను దీన్ని ఎందుకు ఉదాహరణగా చెప్తున్నా అంటే.. ఓటింగ్ చేసేటప్పుడు ఒక ప్యానల్‌ని గెలిపించండి. అటూ ఇటూ ఉంటే పనులు జరగవు. నేను ఆ తరువాత వర్క్ నేర్చుకున్నాను.. ఇంతకు ముందు మాలో ఏం జరిగిందో తెలుసుకున్నా. మేం ఎవరి మాటల్నీ పట్టించుకోకుండా పని మాత్రమే చేశాం. కరోనా టైంలో మా మెంబర్స్ పేషెంట్స్ అయినప్పుడు బెడ్స్ దొరకలేదు. వాళ్ల కోసం మాకు ఉన్న పరిచయాలతో బెడ్స్ దొరికేలా చేశాం. కేవలం సర్వీస్‌ని మాత్రమే చేశాం. మా ప్రతి వర్క్ వెనుక ఎమోషన్ ఉంది. ఇక్కడ ఏమీ జరగలేదని మీరు అంటే తీసుకోవడానికి చాలా బాధగా ఉంది. మేం పని చేయడానికి ఇంకా రెండు నెలలు టైం ఉంది కదా.. అదే పనిలో ఉన్నాం.. మా ఫ్రెండ్ దగ్గర నుంచి కూడా డొనేషన్స్ తీసుకుని హెల్ప్ చేస్తున్నాం. మాలోకి ఎవరైనా రావొచ్చు.. వచ్చే ముందు ఒక బాహుబలి లాగ రావొద్దు.. ఒక మదర్ థెరిస్సా మాదిరి రండి.. వచ్చి సర్వీస్ చేయండి. పనిచేస్తే గుర్తింపు ఎలాగైనా వస్తుంది’ అని అన్నారు .


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3gWJdwv

No comments:

Post a Comment

'Kashmir Needs A Bal Thackeray'

'Afzal Guru became a victim of Pakistan's conspiracy. He was used as a means, just like all other innocent Kashmiris.' from re...