Saturday 26 June 2021

Sadha : బాలయ్య చిన్న పిల్లవాడు.. ఎన్టీఆర్‌ చేసినట్టు ఎవ్వరూ చేయలేరు : హీరోయిన్ సదా

వెళ్లవయ్యా వెళ్లూ.. అంటూ తెలుగు సినీ ప్రేక్షక లోకాన్ని కట్టిపడేశారు. అలా జయం సినిమాతో టాలీవుడ్‌లోకి సదా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. నితిన్‌కి కూడా మొదటి సినిమానే అయినా ఆయన కంటే ఎక్కువగా స్టార్డంను సొంతం చేసుకున్నారు సదా. కోలీవుడ్, టాలీవుడ్ అనే తేడా లేకుండా సదా అన్ని భాషల్లో దుమ్ములేపేశారు. మరీ ముఖ్యంగా సదా సౌత్‌లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా దూసుకుపోయారు. అందం, నటన ఇలా అన్నింట్లోనూ తనకు తానే సాటి అని నిరూపించుకున్నారు. అలా సదా ఇప్పుడు కాస్త కనుమరుగైనట్టు కనిపిస్తున్నారు. ఆ మధ్య బుల్లితెరపైనా సదా సందడి చేశారు. ఢీ షోకు జడ్జ్‌గా తన దైన శైలిలో రక్తికట్టించారు. డ్యాన్సులు, కౌంటర్లతో ఆడియెన్స్‌ను ఆకట్టుకున్నారు. అయితే తాజాగా అలీతో సరదాగా షోలో గెస్ట్‌గా విచ్చేశారు. అలా సదా చాలా కాలం తరువాత తెరపై కనిపించడంతో ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. అయితే ఈ షోలో సదా చెప్పిన కొన్ని విషయాలు, చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి. సదా జోరు కొనసాగుతున్న తరుణంలో కుర్ర హీరో, సీనియర్ హీరో అని తేడా లేకుండా నటించేశారు. అలాంటి సమయంలోనే ఎన్టీఆర్‌తో నాగ, బాలయ్యతో వీరభద్ర సినిమాలో నటించేశారు సదా. ఇదే విషయంపై సదాను అలీ ప్రశ్నలు సంధించారు. , గురించి చెప్పండని అడగడంతో సదా అదిరిపోయేలా సమాధానాలు ఇచ్చారు. ఎన్టీఆర్‌లా డ్యాన్స్ చేసే వారిని ఇంత వరకు చూడలేదు అని యంగ్ టైగర్ మీద ప్రశంసలు కురిపించారు. ఇక బాలయ్య అయితే చిన్న పిల్లవాడు ఎలా ఉంటారో అలానే ఉంటారని సదా చెప్పుకొచ్చారు. ఇక ఇదే ప్రోగ్రాంలో జయం సినిమా విశేషాలు, నాడు జరిగిన ప్రమాదం, తన వ్యక్తిగత జీవితం గురించి ఎన్నో విషయాలు బయటపెట్టేశారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2UEMDeK

No comments:

Post a Comment

'Don't Involve My Family!'

'My weakness is my family, and the people I love.' from rediff Top Interviews https://ift.tt/2lOucDz