గత ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూడటంతో ఒక్కసారిగా అందరి చూపు జూనియర్ ఎన్టీఆర్‌పై పడింది. ఈ పరిస్థితుల్లో తెలుగు దేశం పార్టీకి ఓ యువ నాయకుడి అవసరం ఉందనే టాక్ మొదలైంది. అంతేకాదు జూనియర్ మాత్రమే తెలుగు దేశం పార్టీ జెండాను తిరిగి రెపరెపలాడించగలడు అనే చర్చలు షురూ కావడం, దానిపై చాలామంది సినీ, రాజకీయ ప్రముఖులు రియాక్ట్ కావడం చూశాం. కాగా తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఇదే అంశంపై సీనియర్ నటుడు, రాజకీయవేత్త సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. గతంలో 2009 ఎన్నికల్లో ఎన్నికల్లో టీడీపీ తరఫున జూనియర్ ఎన్టీఆర్ ప్రచారానికి వెళితే జనం భారీగా వచ్చారు. తాతలా వాగ్ధాటి ఉన్నవాడు కావడంతో అంతా అట్రాక్ట్ అయ్యారు. ఆ సమయంలోనే తారక్ ఎంట్రీ ఖారరైందని అంతా భావించగా అనూహ్యంగా ఆ ఎన్నికల తర్వాత పార్టీ కార్యక్రమాల్లో కనిపించలేదు ఎన్టీఆర్. అయితే మళ్ళీ రీసెంట్‌గా టీడీపీ హవా తగ్గడంతో ప్రతిఒక్కరూ ఎన్టీఆర్ వైపే చూస్తున్నారు. పార్టీకి తిరిగి పూర్వ వైభవం రావాలంటే ఆయనే దిక్కు అని చర్చించుకుంటున్నారు. సరిగ్గా ఈ పరిస్థితుల నడుమ బాబు మోహన్ చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. 'టీడీపీకి బలం చేకూరాలంటే ఎన్టీఆర్ ఎంట్రీ ఉండాల్సిందే.. అలా అయితేనే పార్టీ బ్రతకొచ్చు' అని బాబు మోహన్ పేర్కొన్నారు. ఎప్పుడొస్తాడా అని తాను కూడా ఎదురు చూస్తున్నట్లు ఆయన తెలిపారు. ఒకవేళ ఎన్టీఆర్ పాలిటిక్స్ లోకి వస్తే పార్టీకి పట్టిన ఆ మసి అంతా కడిగేసి వస్తారో.. లేక వేరే పార్టీ పేరుతో రంగంలోకి దిగుతారో తెలియదుగా అంటూ బాబు మోహన్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. కాగా, ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న RRR సినిమాతో బిజీగా ఉన్నారు ఎన్టీఆర్. ఈ సినిమాలో కొమురం భీం పాత్రలో ఆయన నటిస్తున్నారు. ఇది పూర్తి కాగానే కొరటాల శివతో సెట్స్ మీదకు వెళ్లనున్నారు ఎన్టీఆర్.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3hn2p5E
No comments:
Post a Comment