Sunday, 27 June 2021

Bandla Ganesh : ఇకపై అలానే పిలుస్తా.. పవన్ కళ్యాణ్‌కు కొత్త పేరు పెట్టేసిన బండ్ల గణేష్

మాటల తుపానుగా అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. స్టేజ్ ఎక్కితే చాలు స్టార్ రైటర్లను మించే పోయేలా ప్రాసలతో పిచ్చెక్కిస్తుంటారు. పొగడాలన్నా, సెటైర్లు వేయాలన్నా కూడా బండ్ల గణేష్ స్టైలే వేరు. ఇక ఇప్పుడు నెటిజన్లు బండ్ల గణేష్‌ను ఒక విషయం పదే పదే గుర్తు చేస్తుంటారు. ఏదైనా సినిమాకు రైటర్‌గా పనిచేయ్ అన్నా.. నువ్ ఇచ్చే ఎలివేషన్స్ ఓ రేంజ్‌‌లో ఉంటాయని కామెంట్లు పెడుతుంటారు. ఆ మధ్య జరిగిన వకీల్ సాబ్ ఈవెంట్‌లో బండ్ల గణేష్ స్పీచ్ ఎంతగా హైలెట్ అయిందో అందరికీ తెలిసిందే. ఆనాడు వేణు శ్రీరామ్, దిల్ రాజు ఎంతో ఎమోషనల్ అయినా కూడా బండ్లన్న స్పీచే వైరల్ అయింది. ఇక చివరకు ఇచ్చిన ప్రసంగం కూడా నెట్టింట్లో అంతగా వైరల్ అవ్వలేదు. ఇక బండ్ల గణేష్ ఈ మధ్య మా ఎన్నికల సందర్భంగా ప్రకాష్ రాజ్ ప్యానెల్ తరుపున మాట్లాడిన మాటలు అందరినీ కట్టిపడేశాయి. మీడియా అడిగిన ప్రశ్నలకు సైతం అంతేస్థాయిలో సమాధానాలు ఇచ్చారు. తాజాగా బండ్ల గణేష్ చేసిన ఓ పోస్ట్ అందరినీ ఆకట్టుకుంటోంది. మామూలుగా అయితే బండ్ల గణేష్ తన హీరో పవన్ కళ్యాణ్‌ను దేవుడిగా కీర్తిస్తారు. తనకు తాను భక్తుడిని అని ప్రకటించుకున్నారు. వకీల్ సాబ్ ఈవెంట్‌లో ఈ విషయాన్ని ఇంకాస్త గట్టిగా ప్రకటించుకున్నారు. బాంచెన్ సగర్వంగా చెప్పుకుంటా అని స్టేజ్ మీద ఊగిపోయారు. అయితే తాజాగా తన పిలుపును మార్చుకున్నారు బండ్ల గణేష్. పవన్ కళ్యాణ్‌కు బండ్ల గణేష్ కొత్త పేరునుపెట్టేశారు. ‘నా దేవరతో నేను.. భక్త కన్నప్ప పరమేశ్వరడుని దేవర అని పిలుచుకునేవారు. నేను కూడా ఈరోజు నుంచి నా బాస్‌ని దేవర అని పిలుస్తాను’ అంటూ బండ్ల గణేష్ ఓ పోస్ట్ చేశారు. దీంతో పాటు ఓ ఫోటోను కూడా షేర్ చేశారు. గబ్బర్ సింగ్ సమయంలో దిగిన ఓ స్టిల్‌ను బండ్ల గణేష్ షేర్ చేశారు. ప్రస్తుతం బండ్లన్న వేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3hcJoCK

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....