టాలీవుడ్‌లో మళ్లీ రగడ మొదలైంది. మా ఎన్నికల సెగలు అప్పుడే మొదలయ్యాయి. ఇంకా ఎన్నికలకు మూడు నాలుగు నెలల సమయం ఉన్నా కూడా వేడి మాత్రం ఇప్పుడే ప్రారంభం అయింది. ఈ సారి పోటీ మరింత రసవత్తరంగా సాగేలా ఉంది. విమర్శలు, ఆరోపణలతో ఒకరి మీద మరొకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. నాగబాబు మాట్లాడిన మసకబారిన డైలాగ్, నాగబాబు చేసిన కామెంట్లు ప్రస్తుతం అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. తాజాగా మా అధ్యక్షుడు నరేష్ ప్రెస్ మీట్ పెట్టి అన్నింటిపైనా క్లారిటీ ఇచ్చారు. అదే క్రమంలో చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ‘ఇన్ని రోజులు అబద్దాలు వింటూ వచ్చాం.. బయట అందరూ కరోనాతో బాధపడుతు ఉంటే.. మేం మాత్రం మరింత బాధను భరిస్తూ వచ్చాం. మేం పని చేస్తూ ఉన్నా కూడా ఆరోపణలు చేస్తూ వచ్చారు. ఎక్కువ బాధ కలిగింది. ‘మా’ అంటే అమ్మ.. మా అమ్మ నాకు జన్మ ఇస్తే.. సినీ పరిశ్రమ పునర్జన్మ ఇచ్చింది. మా పరిశ్రమను ఎవరైనా తిడితే నేను మాత్రం ఊరుకోను. నేను తిరిగి తిడతాను.. అందరిచేత తిట్లు తింటాను. నేను ఏం మాట్లాడినా అందులో నిజం ఉంటుంది. మీ అమ్మను మీరు కించపర్చుకోకండి.. అమ్మను ఎంత ప్రేమిస్తారో.. సినిమా పరిశ్రమను అంతే ప్రేమించండి.. కానీ మీరు ఇప్పటికీ మా మీద ఆరోపణలు చేస్తున్నారు. వాట్సప్ గ్రూపుల్లో కామెంట్లు పెడుతున్నారు. కుర్చీ మీద అంత ప్రేమ ఏంటి? కావాలంటే తీసుకోండి..అంత అధికార దాహం ఏంటి? అయినా అది ఓ సేవలాంటిదని కరాటే కళ్యాణి అన్నారు. మా కమిటీ ఫోర్స్‌లో ఉంటే. అక్కడ ఎలా మాట్లాడతారు. అక్కడ వారు మాట్లాడుతుంటే ఎలా మద్దతిస్తారు. మీరు సినిమాను అమ్మగా భావిస్తే అలా చేయరు. స్టేజ్ మీద పక్కనే ఉండి చప్పట్లు కొడితే శిక్షార్హులు. వారు అలా మాట్లాడుతుంటే.. మసకబారిందని అనాల్సిన అవసరం లేదు.. మీరు అలా సైలెంట్‌గా స్టేజ్ దిగా రావొచ్చు. లోకల్ నాన్ లోకల్ అని వదిలేద్దాం.. మేం తమిళనాడులో పోటీ చేయోచ్చా? ఓట్లు వేయకపోయినా, ఎన్నికల్లో పాల్గొనకపోయినా కూడా పోటీ చేయొచ్చు.. ‘మా’ కార్డు ఇచ్చింది కదా? ఏదైనా చేయోచ్చు. పని చేయలేదు అని ప్రతీసారి అంటే కోపం వస్తుంది.. మేం కూడా అన్నీ మాట్లాడగలం..మేం ఏమైనా పని చేయకుండా గెలుస్తున్నామా?.. ఇవన్నీ నరేష్ గారు చూపించారు.. తప్పులు ఏమైనా ఉంటే చూపించండి.. లేదా ఎవరైనా మంచి వ్యక్తిని చూపించండి.. డిసిప్లినరీ కమిటీ దగ్గరకు వెళ్దాం.. మేం అంతా ఓటు వేస్తాం.. కరోనాలో కూడా ఈ గొడవలు ఏంటి.. అందరూ అంటున్నారు. అది కాదు కావాల్సింది..ఎవరికైనా సాయం చేయాలంటే చేయండి.. ఓ పది వేలు ఇస్తే.. మంచి వాళ్లని వాళ్లే చెబుతారు.. మనం చెప్పనక్కర్లేదు. మా కమిటీ ఇంకా ఫోర్స్‌లో ఉంది.. రెండు మూడు నెలలు టైం ఉన్నా కూడా మీరు అక్కడికి వెళ్లి వారు మాట్లాడుతుంటే మద్దతు పలికారు. ఇది కచ్చితంగా నేరమే. శిక్ష పడాల్సిందే. పదవులున్నాయంటే ఏది పడితే అది చేస్తే కుదరదు. ఎన్ని అన్నా కూడా రాత్రి పగలు కష్టపడి చేశాం.. కరోనా సమయంలో ఇంత కష్టపడితే మసకబారిందని ఎలా అంటారు.. మహిళకు అవకాశం ఇస్తే మేం అంతా కూడా సహకరిస్తాం.. డిసిప్లినరీ కమిటీ ఎవరిని నిర్ణయిస్తే వారికి మద్దతుగా నిలుస్తాం.. మా అమ్మ నాకు అన్నం పెట్టింది.. నాకు విలువను ఇచ్చింది సినీ పరిశ్రమ. ఆడవాళ్లు అంటే గౌరవం లేని వ్యక్తులకు మేం మద్దతు ఇవ్వం. ప్రత్యక్షంగా నేనే ఉదాహరణని. ఆడవాళ్లను గౌరవించని వారిని ఒప్పుకునేది లేద’ని ప్రకాశ్ రాజ్ మీద పరోక్షంగా కరాటే కళ్యాణి కౌంటర్లు వేశారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/35Vmg6K
No comments:
Post a Comment