Wednesday, 30 June 2021

ఆ వార్త చూడగానే గుండె తరుక్కుపోయింది.. గొప్ప మనసు చాటుకున్న సంపూర్ణేష్ బాబు

చిన్న హీరోనే కానీ రియల్ హీరో, మనసున్న మంచి మనిషి, ఆపదలో ఉన్నారంటే సాయం చేయడంలో ఎప్పుడూ ముందే అని నిరూపించుకుంటున్నారు . సాటి మనిషి కష్టాల్లో ఉంటే తట్టుకోలేని ఆయన, ఇప్పటికే చాలా సందర్భాల్లో ఔదార్యం చాటుకున్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో సీసీసీకి, అలాగే వరద బాధితుల సహాయార్థం సీఎం రిలీఫ్ ఫండ్‌కి, రీసెంట్‌గా సినీ జర్నలిస్టు TNR అకాల మరణంతో వారి కుటుంబానికి ఆర్ధిక సాయం అందించిన సంపూర్ణేష్ బాబు.. తాజాగా తల్లిదండ్రులు కోల్పోయిన ఇద్దరు పిల్లలకు సాయం చేసి మంచి మనసున్న హీరో అనిపించుకున్నారు. దుబ్బాక పురపాలక పరిధిలో ఉంటున్న నరసింహచారి దంపతులు అప్పుల భారం మోయలేక ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో వారి ఇద్దరు కుమార్తెలు అనాథలుగా మారారు. ఈ విషయం తెలుసుకొని సంపూర్ణేష్ బాబు వారికి 25 వేల రూపాయల ఆర్ధిక సాయం అందించారు. ప్రతి మనిషికి జీవితంలో కష్టం, ఆర్ధిక ఇబ్బందులు ఉంటాయని, వాటికి ధైర్యంగా ఎదుర్కోవాలే తప్ప ఆత్మహత్యకు పాల్పడి కుటుంబాన్ని రోడ్డున పడేయొద్దని సంపూ అన్నారు. ఈ మేరకు తన ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ పెట్టిన సంపూర్ణేష్ బాబు.. ''దుబ్బాకలో నరసింహచారి గారి కుటుంబంలో జరిగిన ఈ వార్త చూసి గుండె తరుక్కుపోయింది. కరోనా కష్టకాలంలో ఎంతో మంది పనులు కోల్పోయి వీధిన పడుతున్నారు. తల్లితండ్రులు కోల్పోయిన ఆ పిల్లలకు Rs.25000/- నేను మరియు మా హృదయకాలేయం, కొబ్బరిమట్ట నిర్మాత Sai Rajesh అందిచడం జరిగింది. ఎంత వరకు చదువుకుంటే అంత పూర్తి ఖర్చులు మేము చూసుకుంటాం అని వారికి మాట ఇవ్వటం జరిగింది. ఈ కష్టకాలంలో తోటి వ్యక్తులకు మన వంతు సహాయం అందిచడం మన కర్తవ్యం'' అని పేర్కొన్నారు. దీంతో చిన్ననటుడే అయినా సంపూది పెద్ద హృదయమని, ఆయన చేసిన ఈ సాయం అభినందనీయం అని పలువురు పేర్కొంటున్నారు. ప్రస్తుతం సంపూ 'క్యాలీఫ్లవర్' సినిమా చేస్తున్నారు. రీసెంట్‌గా షూటింగ్ ఫినిష్ చేసుకున్న ఈ మూవీ విడుదలకు రెడీగా ఉంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3y9IZaZ

No comments:

Post a Comment

'I Focused On Studying Charles Sobhraj'

'The opportunity to live as the Serpent excited me.' from rediff Top Interviews https://ift.tt/AtWXqwk