Monday, 28 June 2021

Rgv: అరియానాతో మరో బోల్డ్ వీడియో.. జస్ట్ చిల్ అంటూ హేటర్స్‌కి ఆర్జీవీ మెసేజ్! నేరుగా ఆ మాట చెబుతూ..

ఏది చేసినా అందులో ఓ కొత్తదనం ఉండేలా చూసుకుంటారు. విమర్శలు, ప్రశంసలు లాంటి వాటిని పెద్దగా పట్టించుకోని ఆయన.. నిత్యం ఏదో ఒక అంశంతో జనం నోళ్ళలో నానుతుంటారు. సోషల్ మీడియాలో హైలైట్ కావడం ఎలా? అనేది వర్మకు తెలిసినంతగా ఇంకెవ్వరికీ తెలియదేమో అనిపిస్తోంది రీసెంట్ పరిణామాలు చూస్తుంటే. సమాజంలోని ప్రతి అంశంపై ఫోకస్ పెట్టే వర్మ బోల్డ్ విషయాలను ఓపెన్ గానే మాట్లాడుతుండటం చూస్తున్నాం. ఈ క్రమంలోనే రీసెంట్‌గా ' బోల్డ్ ఇంటర్వ్యూ విత్ ' ఏ మేర చర్చల్లో నిలిచిందో తెలిసిందే. సాధారణమైన ఇంటర్వ్యూలకు బిన్నంగా బోల్డ్ అంశాలను జోడిస్తూ యంగ్ యాంకర్‌తో ఇంటర్వ్యూ ప్లాన్ చేశారు వర్మ. తనదైన కెమెరా యాంగిల్స్ ఉపయోగిస్తూ జిమ్ములో అరియానా అందాలపై ఫుల్ ఫోకస్ పెట్టారు. ఇక విడుదలకు ముందు ఈ ఇంటర్వ్యూను సినిమా రేంజ్‌లో పబ్లిసిటీ చేశారు. అయితే ఈ వీడియో రిలీజ్ అయ్యాక వర్మపై కొందరు నెగెటివ్ కామెంట్స్ చేయడమే గాక, కూతురు వయసున్న యంగ్ యాంకర్‌తో అలాంటి పనులేంటి? అంటూ విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో ఎప్పటిలాగే అలాంటి విమర్శలను పెద్దగా లెక్కచేయని రామ్ గోపాల్ వర్మ.. ఎవరేమనుకుంటే నాకేంటి? అంటూ మరో అడుగు ముందుకేశారు. ఓ వీడియో ద్వారా 'జస్ట్ చిల్' అంటూ తనపై వస్తున్న విమర్శలను తిప్పికొట్టారు. నాతో అరియానా గ్లోరి చేసిన ఇంటర్వ్యూ ఫుల్ సక్సెస్ అయింది. దాదాపు 40 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. అందుకు నేను, అరియానా చాలా హ్యాపీగా ఉన్నాం. ఎవరెవరైతే ఆ ఇంటర్వ్యూ చూసి సంతోషంగా ఫీల్ కాలేదో వాళ్లందరికీ లవ్ యూ.. అప్పుడప్పుడూ కాస్త చిల్ అవడం నేర్చుకొని అని వర్మ అన్నారు. ''ఈ సందర్భంగా అరియానా మిక్స్ ఆర్జీవీ అంటూ అదే వీడియో చిన్న చిన్న గిమ్మిక్కులు చేసి మళ్ళీ రిలీజ్ చేస్తున్నాం. ఇది ఇంకో వర్షన్. చూడండి.. చూసి ఆనందించండి. దూషించడం లాంటివి కూడా చేయండి. దానివల్ల కూడా మాకు వ్యూస్ పెరుగుతాయి'' అని రామ్ గోపాల్ వర్మ పేర్కొన్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3jnWiAA

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....