Saturday, 26 June 2021

MAA Elections : నాగబాబు అలా అనడం తప్పు.. ఆ మాటకు షాక్ అయ్యాం.. నరేష్ కామెంట్స్ వైరల్

టాలీవుడ్‌లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) రగడ మొదలైంది. ప్రెస్ మీట్లతో వ్యవహారం వేడెక్కిపోతోంది. మొన్న తన ప్యానల్‌ని పరిచయం చేశారు. ఆ సమావేశంలో , బండ్ల గణేష్, ప్రకాష్ రాజ్ మాట్లాడిన మాటలు బాగానే వైరల్ అయ్యాయి. అయితే తాజాగా వీకే ఇప్పుడు వాటికి కౌంటర్లు ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే తానేమీ కథలు చెప్పేవాడిని కాదని, ఉన్న వాస్తవాలను చెప్పడానికి కాగితాలతో వచ్చేవాడిని అని నరేష్ చెప్పుకొచ్చారు. ఇక ప్రకాష్ రాజ్ మీడియా మీద సెటైర్లు వేస్తే.. నరేష్ మాత్రం మీడియాను గౌరవించారు. సీనియర్ జర్నలిస్ట్, పీఆర్వో బీఏరాజు, నటుడు, జర్నలిస్ట్ అయిన టీఎన్ఆర్‌కు నివాళి అర్పించి అందరి మనసు గెలిచారు. ఈ ప్రెస్ మీట్‌లో నరేష్ మాట్లాడుతూ.. ‘ప్రకాశ్ రాజ్ నాకు మంచి మిత్రుడు.. నేను పోటీ చేయాలని అనుకుంటున్నాను అని నాకు ఫోన్ చేశారు. అయితే ఇంకా టైం ఉంది ఎలక్షన్ అని ప్రకటించిన తరువాత ఎవరైనా పోటీ చేయోచ్చని అన్నాను. అయితే ఆ సమయంలోనే కరోనా, ఇన్సూరెన్స్ అంటూ ఎన్నో పనులున్నాయని అన్నాను. పోటీ ఎవరు చేసినా, అధ్యక్షుడిగా ఎవరొచ్చినా స్వాగతిస్తామని చెప్పాను. మంచు విష్ణు.. మన ఇంటి బిడ్డ.. కష్టనష్టాలు, లాభనష్టాలు చూడకుండా వందల వేల మందికి అన్నం పెట్టినవారు. అలాంటి బిడ్డ పోటీ చేస్తానన్నారు. నేను అధ్యక్షుడిగా ఎన్నికైనా నాడు ఓ మాట చెప్పాను. ఈ పదవికి ఒక్కసారే పోటీ చేస్తా.. రెండో సారి చేయను అని నాడే చెప్పాను. అయినా నాది రెండేళ్ల ప్రయాణంలా చూడకండి..నేను ‘మా’లో ఆరేళ్లుగా ఉన్నాను. అయినా ఇది రాజకీయ వ్యవస్థ కాదు. చిరంజీవి, మొరళీమోహన్, మోహన్ బాబు, కృష్ణంరాజు, కృష్ణ వంటివారంతా కలిసి పెట్టారు. ఎక్కడో మద్రాస్‌లో ఉన్న పరిశ్రమను ఇక్కడకు తెచ్చారు.. మన అందరికీ ఓ గొడుగులా ఉండాలని వారంతా కలిసి ఈ సంస్థను పెట్టారు. అధ్యక్షుడిగా ఎవరు వచ్చినా కూడా సంతోషమే. ఇప్పుడు ఇన్సూరెన్స్ పనులు జరుగుతన్నాయి.. మా డబ్బులు మేం వేసుకుని ఇన్సూరెన్స్ చేయిస్తున్నాం. ఇలాంటి సమయంలో ప్రకాష్ రాజ్ ప్రెస్ మీట్ పెట్టుకున్నారు. అలా ఎవ్వరైనా సరే పెట్టుకోవచ్చు. అది వారి హక్కు. ఆయన్ని మేం ఏం తప్పు అనడం లేదు. మా కమిటీ ఫోర్స్‌లో ఉన్నవారు కూడా అక్కడ కనిపించారు. అది మాకు కొంచెం బాధగా అనిపించింది. నాగబాబు గారు నాకు మంచి మిత్రుల. ఆయన ఓ మాట అన్నారు. ‘మా’ నాలుగేళ్లుగా మసకబారింది అని అన్నారు. అలా అనడడం తప్పు.. మాతో నాలుగేళ్లుగా ఉన్నారు.. బైలాస్ ప్రకారం అలా అనకూడదు. అలా అనడం అనమాకు షాక్ అనిపించింది.. రెండేళ్లలో కొంత అసమ్మతి ఉన్నా కూడా పెద్దలందరూ కలిసి అన్ని సమసిపోయేలా చేశారు. మా మసకబారిందా.. ముందుకు వెళ్తోందా? అని మేం అంతా కూడా కలిసి చర్చించుకున్నాం. అలా మాట్లాడటం, సంస్థను కించపరచడడం మంచిది కాదు. లోకలా?నాన్ లోకలా? అని మేం అనం.. ఓటు వేశారా? ఎన్నికలకు వచ్చారా? జనరల్ బాడీ మీటింగ్‌కు వచ్చారా? అని మేం అనం. ఇప్పటి వరకు 728 మందికి లైఫ్ ఇన్సూరెన్స్ చేయించాం. చనిపోయే సినీ ఆర్టిస్ట్‌ల కుటుంబాలకు వెంటనే మూడు లక్షల రూపాయల చెక్కులు ఇప్పించామని నరేష్ తెలిపారు. ప్రకాష్ రాజ్‌కు కనీసం మా మెంబర్స్ ఎంత మంది ఉంటారు? ఎంత మంది సభ్యులు ఉంటారో కూడా తెలియదన్నట్టుగా అన్నీ లెక్కలు చెప్పి చురకలు అంటించారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3jg5gQn

No comments:

Post a Comment

'I Wanted Waheeda Rehman For Ankur'

'I don't think Waheeda had the confidence that I could pull it off, so she said no.' from rediff Top Interviews https://ift.tt...