జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ వస్తున్నాడు టాలీవుడ్ యంగ్ హీరో అల్లరి నరేష్. వైవిధ్యభరితమైన కథాంశాలను ఎంచుకుంటూ తనదైన శైలిలో కామెడీ పండిస్తున్న ఆయన.. తెలుగు తెరపై రాజేంద్రప్రసాద్ తరువాత స్థానంలో నిలిచాడని చెప్పుకోవచ్చు. మినిమమ్ గ్యారంటీ హీరోగా దర్శకనిర్మాతలకు బెటర్ ఛాయిస్ అవుతున్న ఈ అల్లరోడు '' అంటూ మరో డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాతో మనముందుకు రాబోతున్నాడు. నేడు (జూన్ 30) పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ప్రీ లుక్ రిలీజ్ చేస్తూ అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. రీసెంట్‌గా ‘నాంది’ సినిమాతో సూపర్ డూపర్ హిట్ ఖాతాలో వేసుకున్న ఆయన.. ఇప్పుడు 'సభకు నమస్కారం' అంటున్నాడు. సతీశ్ మల్లంపాటి దర్శకుడిగా పరిచయం కాబోతున్న ఈ సినిమాను ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మహేశ్ కోనేరు నిర్మిస్తున్నారు. అల్లరోడి కెరీర్‌లో 58వ సినిమాగా ఈ మూవీ రూపొందుతోంది. తాజాగా విడుదలైన పోస్టర్‌లో ఓ వైపు జేబులో నోట్ల కట్టలు, మరోవైపు జేబులో మందు సీసా కనిపిస్తుండటం చూస్తుంటే ఇది పొలిటికల్ నేపథ్యంలో రూపొందుతున్న సినిమా అని అర్థమవుతోంది. ఈ చిత్రంలో నరేష్ క్యారెక్టర్ గత సినిమాలకు పూర్తి భిన్నంగా ఉంటుందని అంటున్నారు. నాంది లాగే సీరియస్ సబ్జెక్ట్‌ని తీసుకొని, ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెట్టే రాజకీయ నాయకుల శైలిని విమర్శించేలా పొలిటికల్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ రెండో వారం తర్వాత ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నారట. ఇతర తారాగణంతో పాటు సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను అతిత్వరలో చిత్రయూనిట్ ప్రకటించనుంది.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3h66aO0
No comments:
Post a Comment