
మిల్కీ బ్యూటీ ప్రస్తుతం దూసుకుపోతోన్నారు. అటు వెండితెర, ఇటు ఓటీటీల్లో అవకాశాలు కొల్లగొడుతూ ఫుల్ ఫాంలో ఉన్నారు. అయితే తాజాగా తమన్నా బుల్లితెరపైనా అడుగుపెట్టేందుకు రెడీగా ఉన్నట్టు కనిపిస్తోంది. తాజాగా ఈ మేరకు ఆమె షేర్ చేసిన ఓ ఫోటో, ఇచ్చిన సమాచారం అందరినీ ఆకట్టుకుంటోంది. అది కూడా మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతితో కలిసి బుల్లితెర మీద రచ్చ చేసేందుకు తమన్నా సిద్దంగా ఉన్నారు. ఈ మేరకు తమన్నా షేర్ చేసిన ఫోటో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. మామూలుగా బయట ఎక్కడా కూడా కనిపించరు. ఆయన తన సినిమాలతోనే క్షణం తీరిక లేకుండా గడిపేస్తుంటారు. అలాంటి విజయ్ సేతుపతి ఓ షోలో కనిపించబోతోన్నారు. అది కూడా వంటల ప్రోగ్రాంలో. పాల సుందరి తమన్నా హోస్ట్‌గా ఈ షో రాబోతోన్నట్టు తెలుస్తోంది. మాస్టర్ చెఫ్ అంటూ తెలుగులో రాబోతోన్న ఈ షోలో విజయ్ సేతుపతితో తమన్నా రచ్చ చేయనున్నారు. త్వరలో జెమినీ టీవీలో రాబోతోన్న మాస్టర్ చెఫ్ ప్రోగ్రాంకు సంబంధించిన ప్రోమో షూటింగ్‌లో విజయ్ సేతుపతి ఉండటం నాకెంతో సంతోషంగా ఉంద.. ఇదో కుకింగ్ షో, షూటింగ్ స్టార్ట్ కాకముందు ఇలా ఎంజాయ్ చేశామంటూ తమన్నా ఓ ఫోటోను షేర్ చేశారు. ఇందులో విజయ్ సేతుపతి మరింత స్టైలీష్‌గా కనిపిస్తున్నారు. కాస్త లావు తగ్గి సన్నబడ్డట్టు కూడా అనిపిస్తున్నారు. మొత్తానికి తమన్నా, విజయ్ సేతుపతి కలిసి చేస్తోన్న ఈ ప్రోమో ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3hqYK71
No comments:
Post a Comment