Monday, 28 June 2021

సినిమా రౌండప్: ఒకే ఒక జీవితం.. గతం గతః అంటూ అనుష్క ఎమోషనల్! అందుకే రంగంలోకి..

అనుష్క ఎమోషనల్ పోస్ట్ మనిషి జీవితం, మారుతున్న రోజుల్లో ఎలా బ్రతకాలి అనే దానిపై స్టార్ హీరోయిన్ అనుష్క పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. అందమైన ప్రతిరోజు మాయమైపోతోంది కాబట్టి పాజిటివ్ ఆలోచనలతో ముందుకు వెళ్లాలని ఆమె పేర్కొంది. జ‌రిగినదాన్ని త‌లుచుకుని బాధ పడొద్దని, అంద‌రిపై ప్రేమ‌ను చూపించండి అని తెలుపుతూ.. ప్ర‌తిదానిలో కూడా మంచిని వెతుకుతూ ముందుకు వెళ్లే ప్ర‌య‌త్నం చేయండి అని చెప్పింది. ఎప్పుడూ హాయిగా నవ్వుతూ ఉండాలని అనుష్క చెప్పింది. ఒకే ఒక జీవితం ప్రస్తుతం అజయ్ భూపతి దర్శకత్వంలో 'మహా సముద్రం' సినిమా చేస్తున్న శర్వానంద్.. తన 30వ సినిమాగా 'ఒకే ఒక జీవితం' సినిమాను ప్రకటించారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ సినిమాకి శ్రీ కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నాడు. రీతూ వర్మ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో అక్కినేని అమల, ప్రియదర్శి కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. అందుకే రంగంలోకి.. ఈ సారి మూవీ ఆర్టిస్ట్ ఎలక్షన్స్ మరింత రసవత్తరంగా మారాయి. అనూహ్యంగా తెలంగాణ వాదంతో సీవీఎల్‌ నరసింహారావు ఈ ఎన్నికల బరిలో దిగారు. అయితే తాను బరిలో నిలవడానికి ముఖ్య కారణం చెప్పారు నరసింహారావు. 'మా' అనేక అవకతవకలకు కేంద్రంగా మారిందని, మంచి చేద్దామని ఎవరైనా ప్రయత్నించినా వారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పేద కళాకారులకు న్యాయం జరుగుతుందని భావించినా అలా జరగలేదు కాబట్టే తానే రంగంలోకి దిగాలని నిర్ణయించుకున్నానని అన్నారు. మరోసారి 'భీష్మ' కాంబో నితిన్ హీరోగా వెంకీ కుడుమల దర్శకత్వంలో రూపొందిన 'భీష్మ' సినిమా సూపర్ సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే. గతేడాది విడుదలైన ఈ సినిమా సాలీడ్ కలెక్షన్స్ రాబట్టి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాతో నితిన్ మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కేశారు. అదే స్పీడుతో 'మాస్ట్రో' పూర్తి చేసిన నితిన్.. మరోసారి వెంకీ కుడుమలతో సినిమా చేయబోతున్నారట. ఇటీవలే వెంకీ చెప్పిన కథ నచ్చి నితిన్ ఓకే చెప్పారని తెలుస్తోంది. మీనా కాదు నదియా 'దృశ్యం' సినిమాను తమిళంలో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో కమల్ భార్య పాత్ర కోసం మీనాను తీసుకోనున్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే మలయాళంలో పాటు తెలుగులో హీరో భార్య పాత్రలో మీనానే నటించింది కాబట్టి తమిళంలో కూడా ఆమెనే తీసుకుంటే కొత్తదనం ఉండదని భావించి నదియాను ఫైనల్ చేశారట మేకర్స్.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3jpi0o2

No comments:

Post a Comment

'I Wanted Waheeda Rehman For Ankur'

'I don't think Waheeda had the confidence that I could pull it off, so she said no.' from rediff Top Interviews https://ift.tt...