Sunday, 27 June 2021

Kasthuri Shankar : ఇక్కడ హాస్పిటల్స్ లేవా?.. రజనీకాంత్ అమెరికాకు వెళ్లడంపై కస్తూరీ శంకర్ ఫైర్

నటి సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో అందరికీ తెలిసిందే. అయితే కస్తూరీ శంకర్ ఇప్పుడు తెలుగు వారందరికీ తులసిగా పరిచయం. గృహలక్ష్మి సీరియల్‌తో తులసి పాత్రలో కస్తూరీ శంకర్ ఇప్పుడు అందరికీ దగ్గరయ్యారు. అలా బుల్లితెరపై అందరినీ ఆకట్టుకుంటోన్న కస్తూరీ..సోషల్ మీడియాలో తనలోని మరో కోణాన్ని చూపిస్తున్నారు. సోషల్ మీడియాలో కస్తూరీ సంధించే ప్రశ్నలు.. వేసే కౌంటర్లు,చేసే విశ్లేషణలు అందరినీ ఆకట్టుకుంటాయి. స్వతాహాగా లాయర్ అవ్వడం, సామాజిక అంశాల మీద పట్టు ఉండటం, సమకాలీన రాజకీయ అంశాలపై విశ్లేషణలు చేయడంతో కస్తూరీ శంకర్ ఎప్పుడూ కూడా హాట్ టాపిక్ అవుతుంటారు. అలా తాజాగా కస్తూరీ ఓ అంశం మీద స్పందించారు. ‘మే నెల నుంచి మన ఇండియన్స్ ఎవ్వరూ కూడా అమెరికాకు వెళ్లే చాన్స్ లేదు. యూఎస్ మన మీద బ్యాన్ వేసింది. మెడికల్స్ కోసం కూడా అవకాశం ఇవ్వలేదు. అయితే ఇలాంటి సమయంలో ఎలా వెళ్లారు? ఎందుకు వెళ్లారు?. అప్పుడేమో అలా సడెన్‌గా రాజకీయాల నుంచి తప్పుకున్నట్టు ప్రకటించారు.. ఇప్పుడేమో ఇలా. ఇదంతా ఏదో గందరగోళంగా ఉంది.. రజినీ సర్ ప్లీజ్ అన్నీ క్లారిటీగా చెప్పండి. ఎన్ఆర్‌ఐలు అక్కడే ఉండేవారు లేదా అక్కడ పని చేసేవారికి మాత్రమే ఇండియా నుంచి వెళ్లే చాన్స్ ఉంది. అలాంటి వారిని మాత్రమే అమెరికా రానిస్తోంది. ఇండియా నుంచి బయటకు వెళ్లేందుకు కూడా వీలు లేదు. అలాంటప్పుడు రజినీ ప్రయాణం ఓ మిస్టరీ. భారత ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకుని వైద్యం కోసం అమెరికాకు వెళ్లారని చాలా మంది చెబుతున్నారు. ఆయన ఆరోగ్య సమస్య ఏంటి? ఇండియాలో ఆయన్ను ట్రీట్ చేసే హాస్పిటల్స్ కూడా లేవా? మళ్లీ అది రొటీన్ చెకప్ అంటారు.. మేయో క్లినిక్ అంటే అది హార్ట్‌కు సంబంధించింది. ఇంకా ఎక్కువగా దీని గురించి ఆలోచిస్తుంటే పిచ్చి ఎక్కుతోంది. రజినీకి రూల్స్ వర్తించవు అనే డైలాగ్‌ను మాత్రం అభిమానులు కొట్టండి. దానికంటే ఘోరం మరొకటి ఉండదు. అలాంటి పెద్ద మనుషులే ఇంకా ఎంతో జాగ్రత్తగా ఉంటూ. రూల్స్ పాటించాలి. అయినా కూడా ఇలాంటి పరిస్థితుల్లో ఆయన్ను ఎలా పంపించారు.. ప్రయాణాలు నిశిద్దం అని ఉన్నా కూడా.. పక్కవారిపై ప్రభావం చూపుతుందని తెలిసినా కూడా ఇలాంటివి ఎలా అనుమతిస్తారు.. ఇందులో ఏదైనా లాజికల్‌గా వివరించాల్సింది ఉంటే అది మాక్కూడా తెలియాలి.. ఏ ఒక్కరూ కూడా రూల్స్ కంటే పెద్దవాళ్లు కాదు.. అందరినీ ప్రశ్నించవచ్చు.. అది రజినీకాంత్ అయినా సరే ఇంకొకరు అయినా సరే’ అంటూ కస్తూరీ శంకర్ వరుస ట్వీట్లు వేశారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2U4ie9h

No comments:

Post a Comment

'I Focused On Studying Charles Sobhraj'

'The opportunity to live as the Serpent excited me.' from rediff Top Interviews https://ift.tt/AtWXqwk