Sunday, 20 June 2021

ముఖంపై మొటిమలు రాకుండా ప్రతి రోజు ఆ పని చేస్తుంటా.. షాకింగ్ సీక్రెట్ బయటపెట్టిన తమన్నా!

మిల్కీ బ్యూటీ .. సౌత్ ఇండియన్ ప్రేక్షకులను కొన్నేళ్లుగా అలరిస్తోంది ఈ టాలెంటెడ్ హీరోయిన్. మూడు పదుల వయసులో మత్తెక్కించే శరీరాకృతితో హల్చల్ చేస్తూ వరుస సినిమాల్లో నటిస్తోంది. పదేళ్ల క్రింద ఎంత నాజూకుగా ఉందో ఇప్పుడు కూడా అంతే నాజూకుగా ఉండి మిల మిల మెరిసే అందంతో ప్రతి ఒక్కరిచూపును అట్రాక్ట్ చేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా తన గ్లామర్ సీక్రెట్ బయటపెడుతూ షాకింగ్ విషయం చెప్పింది తమన్నా. ముఖం మీద రావడం అనేది ప్రతిఒక్కరికీ సాధారణమే. అయితే ఈ మొటిమలు తగ్గించుకొని నునుపైన ముఖ సౌందర్యంతో కనిపించాలనేది అందరికీ ఉండే కామన్ కోరిక. ఇందుకోసం క్రీములు రాయడం, విలువైన కాస్టోటిక్స్‌ వాడటం, ట్రీట్‌మెంట్ తీసుకోవడం.. ఇలా తెగ ప్రయత్నాలు చేస్తుంటారు జనం. అయితే హీరోయిన్ తమన్నా మాత్రం ఆ మొటిమలు నివారించేందుకు ఉమ్మి వాడుతుందట. ఇదేంటి? విడ్డూరంగా ఉందే.. అనుకుంటున్నారు కదూ!. అలా అనిపించడం సహజమే కానీ ఈ విషయాన్ని తమన్నానే స్వయంగా చెప్పడం అసలు ట్విస్ట్. ఓ మ్యాగజైన్ కోసం ఇచ్చిన ఇంటర్వ్యూలో.. మీరు మీ ముఖ సౌందర్యం కోసం వేసుకునే స్పెషల్ ఫేస్ ప్యాక్ ఏంటి అని ప్రశ్న వేయగా, తమన్నా క్రేజీ ఆన్సర్ ఇచ్చింది. ఉదయాన్నే లేచిన వెంటనే తన లాలాజాలం (సలైవా)ను ముఖానికి అప్లై చేస్తానని చెప్పి షాకిచ్చింది. అంతేకాదు సలైవా స్కిన్ ప్రాబ్లమ్స్ క్లియర్ చేయడంలో బాగా పని చేస్తుందని కూడా చెప్పుకొచ్చింది. తమన్నా చెప్పిన ఈ బ్యూటీ సీక్రెట్ విని అంతా ఆశ్చర్యపోతున్నారు. ఇండ‌స్ట్రీకి వ‌చ్చి దాదాపు 15 ఏళ్ళు పూర్తి చేసుకున్న తమన్నా.. అందరు అగ్ర హీరోల సరసన నటించింది. తెలుగుతో పాటు త‌మిళ‌, హిందీ, క‌న్న‌డ భాషా చిత్రాల్లో నటిస్తూ 50కి పైగా సినిమాలతో అలరించింది. నేటికీ వన్నెతరగని అందంతో అప్‌కమింగ్ హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తోంది. ప్రస్తుతం ఎఫ్ 3 మూవీతో పాటు నితిన్ 'మ్యాస్ట్రో' సినిమాల్లో నటిస్తోంది తమన్నా.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3gJAfkZ

No comments:

Post a Comment

'Wish I Was Given Other Roles In Addition To Mothers'

'Each mother I have played is different, but the writing dictates the doing of it. If it's written well, that's half the work do...