Wednesday, 2 June 2021

సినిమా రౌండప్: కోరిక బయటపెట్టిన యంగ్ హీరోయిన్.. స్టార్ హీరోతో రామ్‌ పోట్లాట.. సిట్టింగ్స్ స్టార్ట్

స్టార్ హీరోని ఢీ కొట్టబోతున్న రామ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ సినిమాలో స్టార్ త‌మిళ హీరో మాధవన్ విలన్ రోల్ పోషించనున్నారని తెలుస్తోంది. లింగుస్వామి రూపొందించనున్న ఈ మూవీలో ఆయన రిక్వెస్ట్ మేరకు మాధవన్ రెడీ అనేశారని సమాచారం. రవితేజ మూవీ సిట్టింగ్స్ శరత్‌ మండవ దర్శకత్వంలో సుధాకర్‌ చెరుకూరి నిర్మించబోతున్న చిత్రంలో రవితేజ హీరోగా నటించనున్నారు. ఈ సినిమాలో రవితేజ సరసన ఓ హీరోయిన్‌గా ‘మజిలీ’ ఫేమ్‌ దివ్యాంశ కౌశిక్‌ను ఎంపిక చేశారు. అయితే సామ్‌ సిఎస్‌ బాణీలు కట్టబోతున్న ఈ మూవీ మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలు పెట్టారట. కొనసాగుతున్న నితిన్ స్పీడ్ ప్రస్తుతం 'మాస్ట్రో' సినిమాతో బిజీగా ఉన్న హీరో నితిన్.. ఆ వెంటనే వక్కంతం వంశీ దర్శకత్వంలో ఓ మూవీ చేయనున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా షూటింగ్ ఆగస్టు నెల నుంచి స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నాట మేకర్స్. వకీల్ సాబ్ హీరోయిన్ కోరిక టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలో నటించి తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న నివేదా థామస్ తన కోరిక బయటపెట్టింది. తనకు డైరెక్షన్ అంటే చాలా ఇష్టమని, ఫ్యూచర్‌లో తప్పకుండా డైరెక్షన్ చేస్తానని చెప్పింది. ఇటీవలే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'వకీల్ సాబ్‌'లో కీలక పాత్ర పోషించి భేష్ అనిపించుకుంది నివేదా. పొరపాటు తెలుసుకున్న డైరెక్టర్ నాగార్జున కెరీర్‌లో 'మన్మథుడు' ఎంత పెద్ద హిట్ అయిందో 'మన్మథుడు 2' అంతే రేంజ్ ఫ్లాప్ అయింది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకొచ్చి ఘోర పరాజయం చవిచూసింది. అయితే ఈ సినిమాలో రొమాంటిక్ సీన్స్ రూపొందించే విషయంలో తప్పు చేశామని, అదే మిస్టేక్ అని అన్నాడు రాహుల్ రవీంద్రన్.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3yYMEK3

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....