Wednesday, 2 June 2021

44 ఏళ్ళ వయసులో హీరోయిన్ రెండో పెళ్లి.. క్యాన్సర్ ఉంది అయినా! పర్సనల్ విషయాలపై గుట్టువిప్పిన ప్రేమ

సినిమా ఇండస్ట్రీలో పెళ్లిళ్లు, విడాకుల సంగతులు అనేవి కామన్. ఎందరో నటీనటులకు వారి వారి వ్యక్తిగత జీవితాల్లో చేదు అనుభవాలున్నాయి. ప్రేమించి పెళ్లి చేసుకొని కొన్నాళ్ల పాటు వైవాహిక జీవితం నడిపించి విడిపోయిన జంటలు చాలానే ఉన్నాయి. ఈ లిస్టులో సీనియర్ హీరోయిన్ ప్రేమ కూడా ఉంది. కెమెరా ముందు అమాయకత్వం, అందం, అభినయంతో ఆకట్టుకున్న ఆమె పర్సనల్ లైఫ్‌లో కొన్ని మరచిపోలేని సంఘటనలు ఉన్నాయి. అయితే ఎప్పుడూ తన పర్సనల్ లైఫ్ గురించి పెద్దగా మాట్లాడని ఆమె ఇటీవల రియాక్ట్ అయింది. తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ చిత్రాల్లో న‌టించి న‌టిగా త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌మైన స్థానాన్ని సంపాదించింది ప్రేమ. ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటున్నా ఆమె రెండో పెళ్లి వార్తలు మాత్రం వైరల్ అవుతున్నాయి. త్వ‌ర‌లోనే చేసుకోనుందంటూ వార్త‌లు షికారు చేస్తుండటంతో ప్రేమ ఓపెన్ అయింది. తన ఆరోగ్యం గురించి, రెండో పెళ్లి గురించి ఓ క్లారిటీ ఇచ్చేసింది. 2006లో వ్యాపార‌వేత్త జీవ‌న్ అప్ప‌చ్చుని పెళ్లి చేసుకున్న ప్రేమ మ‌న‌స్ప‌ర్ధ‌ల‌తో 2016లో విడాకులు తీసుకొని ప్రస్తుతం ఒంటరి జీవితం గడుపుతోంది. దీంతో ఆమె ఈ వయసులో రెండో పెళ్లి సిద్దమైందనే టాక్ మొదలైంది. అయితే ప్రేమ మాత్రం అవన్నీ ఫేక్ వార్తలని, తాను రెండో పెళ్లి చేసుకోవడం లేదని తేల్చి చెప్పింది. అలాగే ఒకానొక సమయంలో తాను క్యాన్సర్‌తో ఇబ్బంది పడ్డానని, అయితే ప్రెజెంట్ మాత్రం సేఫ్‌గా ఆరోగ్యంగా ఉన్నానని చెప్పింది. 'దేవి' సినిమాతో అప్పట్లో ఓ సెన్సేషన్ క్రియేట్ చేసింది ప్రేమ. దేవత పాత్రల్లో కూడా ఆమె నటించిన విధానం సరికొత్త క్రేజ్ తీసుకొచ్చింది. అమాయకమైన రూపంతో ప్రేక్షకలోకాన్ని ఆకట్టుకొని ప్రతి ఒక్కరి హృదయంలో చిరస్థానం సంపాదించింది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2S94A41

No comments:

Post a Comment

'Aamir Rushed Me To Hospital'

'I couldn't see the injury but I knew it was bad from the expression on Aamir's face.' from rediff Top Interviews https://...