Sunday, 8 November 2020

తన లవ్‌స్టోరీని బయటపెట్టిన ఎమ్మెల్యే రోజా.. ఆరోజును తలుచుకుని మురిసిపోతూ..!

నగరి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, నటి తన ప్రేమకథను బయటపెట్టి ఆనాటి రోజుల్ని గుర్తు చేసుకున్నారు. ప్రముఖ తమిళ సినీ దర్శకుడు ఆర్కే సెల్వమణి అనే దర్శకుడిని ప్రేమించిన రోజా పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకుని సంతోషకరమైన జీవితాన్ని కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. కాగా, ఆర్కే రోజా న్యాయనిర్ణేతగా ఈటీవీలో ప్రసారమవుతోన్న కామెడీ షో ‘ఎక్స్‌ట్రా జబర్దస్త్‌’లో ఆసక్తిక విషయాలు పంచుకున్నారు. ఆనాటి తన ప్రేమ సంగతులు గుర్తు చేసుకున్నారు. ఓ స్కిట్‌లో రోజా-సెల్వమణి ప్రేమకథను స్టేజ్‌పై ఆవిష్కరించి.. పంచులతో నవ్వులు పూయించారు. స్కిట్‌ అనంతరం రోజా తన ప్రేమ కథ గురించి చెప్పాు. తన భర్త సెల్వమణి డైరెక్ట్‌గా తనకు ప్రపోజ్‌ చేయలేదని గుర్తు చేశారు. మొదట తమ ఇంట్లో వారికి చెప్పి వాళ్లు ఓకే అన్న తర్వాతే సెల్వ తన వద్ద ప్రేమ వ్యక్తపరిచారని చెప్పారు. ‘‘ఓ రోజు ‘సీతారత్నంగారి అబ్బాయి’ షూటింగ్‌ టైమ్‌లో నా దగ్గరకి వచ్చి.. ‘ఐ లవ్‌ యూ. మన పెళ్లికి మీ ఇంట్లో ఒప్పుకున్నారు.’ అని చెప్పారు’’ అని ఆనాటి మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుని మురిసిపోయారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3kbENjC

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....