Sunday, 8 November 2020

అక్షరాన్ని మార్చగలరేమో అభిమానాన్ని కాదు: పూజా హెగ్డే స్ట్రాంగ్ కౌంటర్

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డేపై సోషల్ మీడియాలో తెలుగు ప్రేక్షకులు రెండు రోజులుగా తిట్టిపోస్తున్నారు. పూజా దక్షిణాది ప్రేక్షకులను అవమానిస్తూ నీచంగా మాట్లాడారనే ఆరోపణలతో ఒక వీడియో క్లిప్ ఆధారంగా దుమ్మెత్తి పోస్తున్నారు. దీనిపై మీడియాలోనూ కథనాలు వెలువడ్డాయి. ఇటీవల వీడియో కాల్ ద్వారా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ‘అల వైకుంఠపురములో’ సినిమాలోని హీరోయిన్ కాళ్లను హీరో ఇష్టపడటం గురించి ప్రస్తావన వచ్చింది. దీనిలో భాగంగా పూజా మాట్లాడుతూ ‘దక్షిణాదివాళ్లకు నడుము భాగం అంటే పిచ్చి’ అనే అర్థమొచ్చేలా అన్నారు. దీంతో ఆ వీడియో క్లిప్‌ను సోషల్ మీడియాలో పెట్టి ఏకిపారేశారు. కొంత మంది అయితే పూజాపై తిట్ల దండకం అందుకున్నారు. నీకు లైఫ్ ఇచ్చిన సౌత్ ఇండస్ట్రీపై ఇంత దిగజారి కామెంట్లు చేస్తావా? అంటూ విరుచుకుపడ్డారు. అప్పుడు తాప్సి, ఇప్పుడు పూజా హెగ్డే అంటూ వాయించారు. అయితే, తనపై మొదలైన ఈ నెగిటివ్ ప్రచారంపై పూజా హెగ్డే స్పందించారు. తన మాటలను వక్రీకరించి తనపై దుమ్మెత్తి పోస్టున్నారని స్పష్టం చేశారు. తెలుగు సినిమా పరిశ్రమ తనకు ప్రాణంతో సమానం అని అన్నారు. తాను ఏం మాట్లాడానో తెలియాలంటే ఇంటర్వ్యూను పూర్తిగా చూడాలని చెప్పారు. ఈ మేరకు ఆదివారం మీడియా ప్రకటన విడుదల చేశారు. Also Read: ‘‘నేను ఒక ఇంటర్వ్యూలో అన్న మాటలను వేరే సందర్భానికి అన్వయిస్తున్నారు.. అక్షరాన్ని మార్చగలరేమో అభిమానాన్ని కాదు.. నాకు ఎప్పటికీ తెలుగు చలనచిత్ర పరిశ్రమ ప్రాణసమానం.. ఇది నా చిత్రాలను అభిమానించే వారికీ నా అభిమానులకూ తెలిసినా, ఎటువంటి అపార్థాలకూ తావివ్వకూడదనే నేను మళ్ళీ చెబుతున్నా నాకెంతో ఇచ్చిన తెలుగు ఇండస్ట్రీకి ఎప్పటికీ రుణపడి ఉంటాను. పూర్తి ఇంటర్వ్యూను చూడండి. కృజ్ఞతలు - మీ పూజా హెగ్డే’’ అని ప్రకటనలో పేర్కొన్నారు. కాగా, ప్రస్తుతం పూజా హెగ్డే తెలుగులో రెండు సినిమాలు చేస్తున్నారు. అఖిల్ హీరోగా వస్తోన్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ సినిమాలో హీరోయిన్‌గా పూజా నటించారు. ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. మరోవైపు, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న ‘రాధే శ్యామ్’లోనూ పూజా హెగ్డే హీరోయిన్. వీటిలో ‘రాధే శ్యామ్’ చాలా పెద్ద ప్రాజెక్ట్.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3kaGyxx

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....