వివాదాస్పద దర్శకుడు ఏ చిన్న సందర్భం దొరికినా దానిపై తనదైన కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియాను దున్నేస్తుంటారని మనందరికీ తెలుసు. సినీ, రాజకీయాలపైనే గాక ఎప్పటికప్పుడు తాజా పరిస్థితులపై ఫోకస్ పెడుతూ ఓపెన్ అవుతుంటారు వర్మ. ఈ నేపథ్యంలోనే గ్రేటర్ ఎన్నికలపై కామెంట్స్ చేస్తూ పవన్ కళ్యాణ్‌పై పంజా విసురుతున్న ఆయన తీరుపై మెగా అభిమానులు మండిపడుతున్నారు. పవన్ కళ్యాణ్‌పై నెగెటివ్ కామెంట్స్ చేయడం ఆపాలంటూ వార్నింగులు ఇస్తున్నారు. దీంతో ఈ ఇష్యూ జనాల్లో హాట్ టాపిక్ అయింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పోటీ చేస్తుందని ప్రకటించడం, ఆ తర్వాత పోటీ లేదని చెప్పడాన్ని తన ఆయుధంగా మలచుకొని పవన్‌పై సెటైర్స్ వేయడం ప్రారంభించారు వర్మ. పవన్ కళ్యాణ్ మంచి ఎంటర్టైనర్ అని, అందుకే రాజకీయాల్లో తాను అతన్నే అనుసరిస్తానని అంటూ తనదైన కోణంలో లాజిక్ అప్లై చేస్తూ కామెంట్ చేశారు ఆర్జీవీ. ఇలాగే గతంలో కూడా ఆయన పవన్ కళ్యాణ్‌పై వర్మ ఓ రేంజ్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో చిర్రెత్రిపోయిన మెగా ఫ్యాన్స్ వర్మపై ఫైర్ అవుతున్నారు. Also Read: లాజికల్‌గా మాట్లాడినంత మాత్రాన తామేమీ పిచ్చోళ్ళం కాదని, పవన్ కళ్యాణ్‌ని పొగుడుతున్నారా? లేక సెటైర్స్ వేస్తున్నారా? అనేది అర్థం చేసుకోగలమంటూ వర్మపై కౌంటర్లు వేస్తున్నారు మెగా ఫ్యాన్స్. ఇకనైనా అలాంటి సెటైర్లు ఆపాలని, లేదంటే ఊరుకునేది లేదంటూ సోషల్ మీడియా ద్వారా వార్నింగ్స్ ఇస్తున్నారు. దీంతో పవన్- వర్మ ఇష్యూ మరోసారి చర్చల్లో నిలిచింది.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2KRfZ4N
No comments:
Post a Comment