మెగా ఇంట పెళ్లి సంబరాలు షురూ అయ్యాయి. నాగబాబు కూతురు, మెగా డాటర్ వేడుకల కోసం మెగా ఫ్యామిలీ లేడీస్ అంతా ఒక్కచోట చేరి తెగ సందడి చేస్తున్నారు. చిరంజీవి ఇద్దరు కూతుళ్లు, అక్కలైన సుస్మిత, శ్రీజలకు స్పెషల్ పార్టీ ఇచ్చింది నిహారిక. కొద్దిరోజుల క్రితమే గోవాలో స్నేహితులతో కలిసి బ్యాచిలర్ పార్టీ చేసుకున్న నిహారిక.. ఇప్పుడు తన సిస్టర్స్ అందరికీ గ్రాండ్ పార్టీ ఇచ్చినట్లు తెలుస్తోంది. మూడు నెలల క్రిందట మెగా అభిమానులను సర్‌ప్రైజ్ చేస్తూ తాను 'మిస్' నుంచి 'మిసెస్ నిహా'గా ప్రమోట్ అవుతున్నానని, తనకు కాబోయే భర్త ఇతనే అంటూ చైతన్య ఫోటోను స్వయంగా షేర్ చేసిన నిహారిక.. ఆ తర్వాత వెంటనే నిశ్చితార్ధ కార్యక్రమాన్ని ఫినిష్ చేసేసింది. ఇక డిసెంబర్ 9వ తేదీన డెస్టినేషన్ వెడ్డింగ్ ఉంటుందని ఇటీవలే నాగబాబు ప్రకటించడంతో మెగా ఇంట సందడి మొదలైంది. నెల రోజుల ముందునుంచే ఫ్యామిలీలో సెలబ్రేషన్స్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే గత రాత్రి మెగా సిస్టర్స్ అంతా కలిసి చిల్ అయిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. Also Read: ఈ ఫోటోలను నిహారిక తన ఇన్స్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది. మెగా డాటర్స్ అందరూ కలిసి ఫుల్లుగా ఎంజాయ్ చేసినట్లు ఈ ఫోటోలు చూస్తుంటే అర్థమైపోతోంది. నిహారిక పోస్ట్ చూసి ఆమెకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు మెగా ఫ్యాన్స్. ఇకపోతే ఆమె పెళ్లి వేదికైన రాజస్థాన్‌లోని ఉదయ్ పూర్‌లోని కోటను అద్భుతంగా అలంకరిస్తున్నారని తెలిసింది. ఇటీవలే అక్కడికి వెళ్లి పెళ్లి ఏర్పాట్లను ప్రత్యక్షంగా పర్యవేక్షించి వచ్చింది నిహారిక. నిహారికకు కాబోయే భర్త పూర్తిపేరు జొన్నలగడ్డ వెంకట చైతన్య. ఇతను గుంటూరు రేంజ్ ఐజీ ప్రభాకర్ రావు కుమారుడు. ఇటీవలే కాబోయే భర్త చైన్యతో పెళ్లికి ముందే దీపావళి సంబరాలు చేసుకుంది నిహారిక. ప్రస్తుతం నిహారిక పెళ్లి సంగతులు, నిహారిక- చైతన్య జోడీ ఫొటోలతో సోషల్ మీడియా హోరెత్తిపోతోంది.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3fJPYzJ
No comments:
Post a Comment