Saturday, 28 November 2020

విశాఖ తీరాన 'హానీ ట్రాప్'.. అందమైన లొకేషన్స్‌లో అలా!!

విశాఖలోని అందమైన లొకేషన్స్‌లో '' మూవీ తొలి షెడ్యూల్ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. భరద్వాజ్ సినీ క్రియేషన్స్ బ్యానర్ పి. సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో వి.వి.వామన రావు నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఋషి, శిల్ప, తేజు అనుపోజు, శివ కార్తీక్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ షెడ్యూల్‌లో చిత్రానికి సంబంధించిన కీలక సన్నివేశాలతో పాటు రెండు పాటల్ని చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత వి.వి.వామన రావు మాట్లాడుతూ.. 'ఈ చిత్రంలో ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నాను. హీరో ఋషి, హీరోయిన్ శిల్పలపై కొన్ని రొమాంటిక్ సన్నివేశాలతో పాటు ఎమోషనల్ సన్నివేశాలను చిత్రీకరికరించాం. శివ కార్తీక్ యువ రాజకీయ నాయకుడిగా నటిస్తున్నాడు. ఆ సన్నివేశాల్ని చాలా చక్కగా చిత్రీకరించాం. ఈ నెలాఖరుకు విశాఖ షెడ్యూల్ పూర్తి చేస్తాం. ఇప్పటి ట్రెండ్‌కి తగ్గట్లుగా కథని సమకూర్చాను. దానికి తగ్గట్లుగా సునీల్ కుమార్ రెడ్డి అద్భుతమైన లొకేషన్స్‌లో కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కిస్తున్నారు. మేము అనుకున్న దానికన్నా సినిమా బాగా వస్తోంది'' అన్నారు. Also Read: దర్శకుడు పి. సునీల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ''ఇది ఒక సోషల్ థ్రిల్లర్ మూవీ. యూత్ ఆడియెన్స్‌కి నచ్చే ఎన్నో అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయి. ప్రస్తుత సమాజంలో జరుగుతున్న అనేక సంఘటనలను ఈ చిత్రం తెరమీదదకు తెస్తోంది. భీమిలి, అరకు లాంటి అందమైన లొకేషన్స్‌లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. ఎస్ వి శివరాంగారి కెమెరా పనితనం, ప్రవీణ్ ఇమ్మడి మ్యూజిక్ చిత్రానికి ప్రధాన ఎస్సెట్స్ అవుతాయి. నటీనటులు అందరూ మంచి సహకారం అందిస్తున్నారు. డిసెంబర్ నుండి హైదరాబాద్‌లో జరిగే రెండవ షెడ్యూలుతో షూటింగ్ పూర్తవుతుంది. చిత్రాన్ని జనవరి కల్లా రెడీ చెయ్యాలని ప్లాన్ చేస్తున్నాం'' అన్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/36fmIO4

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....