Sunday, 29 November 2020

అర్ధరాత్రి వేళ సుమ కనకాల రచ్చ.. మన టైమ్ రావాల్సిందే అంటూ గుట్టు విప్పిన యాంకరమ్మ!!

బుల్లితెర సెన్సేషన్, మాటల మహారాణి ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో తెగ హంగామా చేస్తోంది. లాక్‌డౌన్ వేళ ఖాళీ సమయం దొరకడంతో బుల్లితెర స్టార్ కాస్త సోషల్ మీడియా స్టార్ అయిపోయింది. ఎప్పటికప్పుడు తన వీడియోలు షేర్ చేస్తూ ఫాలోయింగ్ పెంచుకుంటోంది. ఈ క్రమంలోనే తాజాగా.. తాను అర్దరాత్రి మేకప్ వేసుకుని రెడీగా ఉన్నానని పేర్కొంటూ ఓ వీడియో పోస్ట్ చేసి అసలు మ్యాటర్ చెప్పేసింది. తన పెంపుకు కుక్క జోరోతో కలిసి ఆడుతున్న ఆటలు, పని మనిషిని ఆట పట్టిస్తున్న వీడియోలతో హంగామా చేస్తున్న సుమ మరోసారి తనదైన మాటలతో అందరినీ ఆకట్టుకుంది. అమెరికాలోని తెలుగు ప్రేక్షకుల కోసం '' అనే షోను హోస్ట్ చేస్తోంది యాంకర్ సుమ. ప్రతి ఏడాది ఈ షోను నిర్వహిస్తామని పేర్కొన్న ఆమె.. దీనికోసమే ఇలా ఈ అర్దరాత్రి సమయంలో మేకప్ వేసుకుని రెడీ అయ్యాయని చెబుతూ వీడియో వదిలింది. అయితే గతేడాది కంటే ఈ సారి ఓ గంట ఆలస్యంగా ప్రోగ్రాం మొదలుపెట్టామని చెప్పుకొచ్చింది. టైమ్ ముందుకు జరిగినా వెనక్కి జరిగినా మన టైమ్ రావాల్సిందే అంటూ ఫన్నీగా ముగించింది. దీంతో ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. Also Read: డిజిటల్ టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ సరికొత్తగా అడుగులేస్తున్న సుమ.. యూట్యూబ్‌లో సుమక్క పేరిట ఓ ఛానల్ క్రియేట్ చేసి ఫుల్లుగా ఎంటర్‌టైన్ చేస్తోంది. ఈట్ విత్ టాక్ అనే కొత్త షోను పెట్టి.. సెలబ్రిటీలను ఇంటికి పిలిచి వారిచేతనే ఏదో ఒక స్పెషల్ వంటకాన్ని వండిస్తోంది. దీంతో సుమక్క ఛానల్ తక్కువ కాలంలోనే మంచి పాపులారిటీ దక్కించుకుంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/39pUsKz

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....