మంచు ఫ్యామిలీ నటీనటుల్లో ప్రయాణం ఎంతో ప్రత్యేకమైందని చెపుకోవచ్చు. అటు వెండితెరపై ఇటు బుల్లితెరపై సందడి చేస్తూ తనకంటూ స్పెషల్ ఫాలోయింగ్ ఏర్పర్చుకుంది మంచు లక్ష్మి. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తమ ఫ్యామిలీ విశేషాలతో పాటు సమాజంలోని పరిస్థితులపై స్పందిస్తూ తన అభిప్రాయలు చెప్పే ఆమె.. తాజాగా కొత్త ప్రయాణం స్టార్ట్ చేసింది. ఈ మేరకు ఆ విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ పోస్ట్ పెట్టింది. ట్విట్టర్ వేదికగా తన ముద్దుల కూతురు విద్యా నిర్వాణతో కలిసి కొత్త ఆఫీస్‌లో అడుగుపెట్టిన ఫోటోలను షేర్ చేస్తూ తన ఫీలింగ్స్ అభిమానులతో పంచుకుంది. కొత్త ఆఫీస్ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని, ఈ క్షణాలు ఎంతో మధురమైనవని అని పేర్కొంటూ మీ ప్రేమ ఆశీర్వాదం కావాలని కోరింది. ఇందుకోసం కొన్నాళ్ళుగా ఎంతో ఎగ్జైటింగా ఎదురు చేశానంటూ ఆనందం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆమె షేర్ చేసిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. Also Read: ఈ మధ్యకాలంలో తన కూతురు విద్యా నిర్వాణతో కలిసి సోషల్ మీడియాలో తెగ హంగామా చేస్తున్న మంచు లక్ష్మి.. ఇటీవలే బుట్టబొమ్మ పాటకు స్టెప్పులేసి అందరి దృష్టిని ఆకర్షించింది. అదే జోష్‌లో టెక్నాలజీ వేగంతో పరుగులు పెడుతూ సరికొత్తగా అడుగులు వేస్తోంది. ఇకపై మంచు లక్ష్మి కొత్త వెబ్ సిరీస్‌లు, టాక్ షోలు చేయబోతోన్నట్లు సమాచారం.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/33qR7qL
No comments:
Post a Comment