Sunday 29 November 2020

18 ఏళ్ల వయసులో అలా చేశా.. ముప్పై మంది చూస్తుండగానే! యాంకర్ విష్ణుప్రియ బోల్డ్ కామెంట్స్

సినిమా అన్నాక రొమాంటిక్ సీన్స్ కామన్. పైగా ఈ రోజుల్లో రొమాంటిక్ డోస్ దంచికొడితేనే ప్రేక్షకులు బాగా అట్రాక్ట్ అవుతున్నారు. దీంతో కథతో పాటు హీరోయిన్ అందాల ఆరబోతకు ప్రాముఖ్యత ఇస్తున్నారు దర్శకనిర్మాతలు. మరోవైపు హీరోయిన్లు కూడా కథ డిమాండ్ చేయాలే గానీ రొమాంటిక్ సీన్స్ చేసేందుకు సందేహించమంటూ ఓపెన్‌గా చెప్పేస్తున్నారు. ఈ క్రమంలోనే యాంకర్ తన తాజా సినిమా '' గురించిన విషయాలు చెబుతూ బోల్డ్ కామెంట్స్ చేసింది. బులితెరపై హాట్ యాంకర్‌గా భారీ పాపులారిటీ కూడగట్టుకున్న విష్ణుప్రియ ప్రస్తుతం 'చెక్‌మేట్' సినిమాలో లీడ్ రోల్ పోషిస్తోంది. చిన్ని కృష్ణ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రసాద్ వెలంపల్లి దర్శక నిర్మాతగా తెరకెక్కించిన ఈ సినిమా షూటింగ్ ఫినిష్ చేసుకొని విడుదలకు సిద్ధమైంది. రాజేంద్రప్రసాద్, విష్ణుప్రియ సందీప్, దీక్షపంత్, బ్రహ్మనందం, రఘుబాబు షకలక శంకర్ కీలక పాత్రలు పోషించారు. ఇటీవలే విడుదలైన ఈ మూవీ ట్రైలర్‌లో విష్ణుప్రియ హాట్‌నెస్, రొమాంటిక్ డోస్ చూసి అంతా ఆశ్చర్యపోయారు. Also Read: కాగా తాజాగా 'చెక్‌మేట్' షూటింగ్ సంగతులపై రియాక్ట్ అయిన విష్ణుప్రియ.. ఈ సినిమాలో తాను చాలా హాట్ రోల్ చేశానని, ఓ ఇరవై.. ముప్పై మంది చూస్తుండగానే హాట్ సీన్స్ చేశానని చెప్పుకొచ్చింది. ''హాస్టల్‌లో భగవద్గీత చదువుకునే 18 ఏళ్ల అమ్మాయినైన నేను.. సడెన్‌గా ఇలాంటి హాట్ రోల్ చేయడం కాస్త ఇబ్బందిగా అనిపించింది గానీ.. కథ డిమాండ్ మేరకు కొన్ని సీన్స్ చేశాను. హాట్ సీన్స్ చేయడం చాలా హార్డ్ కానీ మా డైరెక్టర్ దాన్ని కంఫర్టబుల్‌గా తెరకెక్కించారు. అయినా ఆ సీన్స్ చేసేది నేను కాదు సినిమాలోని క్యారెక్టర్. అందుకే నన్ను నేను మోటివేట్ చేసుకొని కెమెరా ముందు నటించా'' అని చెప్పింది విష్ణుప్రియ.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2JuaurH

No comments:

Post a Comment

'Don't Involve My Family!'

'My weakness is my family, and the people I love.' from rediff Top Interviews https://ift.tt/2lOucDz