Saturday 28 November 2020

'మిథునం' బాలీవుడ్ రీమేక్.. బాలసుబ్రహ్మణ్యం పాత్రలో అమితాబ్ బచ్చన్!

లెజెండరీ సింగర్ ఈ లోకాన్ని విడిచి రెండు నెలలు గడిచిపోయినా ఆయన జ్ఞాపకాలు ఇప్పటికీ నెమరు వేసుకుంటున్నారు జనం. గాయకుడిగా, నటుడిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా తెలుగు ప్రేక్షకుల మదిలో ముద్ర వేసిన ఆయన `మిథునం` సినిమాలో విలక్షణ పాత్ర పోషించి ఆకట్టుకున్నారు. రెండే రెండు పాత్రలతో నటుడు, రచయిత తనికెళ్ల భరణి ఈ సినిమాను రూపొందించారు. 2012లో విడుదలైన ఈ మూవీ విమర్శకుల ప్రశంసలందుకుంది. ఇప్పుడు ఈ సినిమాను హిందీలో రీమేక్ చేయబోతున్నారట. Also Read: బాలీవుడ్‌కు చెందిన ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ సినిమా రీమేక్ హక్కులను దక్కించుకుందట. ఈ హిందీ రీమేక్‌లో బాలీవుడ్ మెగాస్టార్ .. ఎస్పీ బాలు పోషించిన పాత్రలో నటించబోతున్నట్టు టాక్. అమితాబ్‌కు జంటగా ఒకనాటి అందాల తార రేఖ నటించనున్నారని తెలుస్తోంది. హిందీ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా కొద్దిగా మార్పులు చేర్పులు చేసి ఈ మూవీ తెరకెక్కించబోతున్నట్టు సమాచారం. ఇక ఈ సినిమాను డైరెక్ట్ చేయబోయేది ఎవరు? ఎప్పుడు స్టార్ట్ అవుతుందనేది అధికారిక వస్తేనే క్లారిటీ వస్తుంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3mfPe7V

No comments:

Post a Comment

'Don't Involve My Family!'

'My weakness is my family, and the people I love.' from rediff Top Interviews https://ift.tt/2lOucDz