Friday 27 November 2020

బాగా ఎంజాయ్ చేశా.. విజయ్ దేవరకొండతో ప్రయాణం ఓ విభిన్నమైన ప్రపంచం! అనన్య పాండే క్రేజీ ఫీలింగ్స్

ఒకప్పుడు టాలీవుడ్ టు బాలీవుడ్ అన్నట్లుగా సాగిన హీరోయిన్స్ ప్రయాణం.. ఇప్పుడు బాలీవుడ్ టు టాలీవుడ్ అన్నట్లుగా మారడం చూస్తుంటే తెలుగు సినిమాల క్రేజ్ ఏ రేంజ్‌లో పెరిగిపోతుందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే చాలామంది తారలు బీ టౌన్ నుంచి వచ్చి తెలుగు తెరపై సందడి చేయగా.. హీరోగా రానున్న 'ఫైటర్' మూవీతో మరో బ్యూటీ తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ మీడియాలో సమావేశంలో పాల్గొన్న అనన్య.. 'ఫైటర్' మూవీలో భాగం కావడం పట్ల ఆసక్తికరంగా రియాక్ట్ అయింది. స్టూడెంట్ ఆఫ్‌ ది ఇయర్‌-2 సినిమాతో కెమెరా ముందుకొచ్చిన అనన్య పాండే తక్కువ సమయంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. మెల్లగా ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ పెంచుకుంటూ వరుస అవకాశాలు పట్టేస్తుంది. ఈ క్రమంలో కెరీర్ ఆరంభంలోనే టాలీవుడ్ నుంచి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఫైటర్' (వర్కింగ్ టైటిల్) మూవీలో ఛాన్స్ కొట్టేసింది. ముంబై బ్యాక్‌డ్రాప్‌లో బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన రొమాన్స్ చేస్తోంది. Also Read: అయితే తాజా ఇంటర్వ్యూలో తన అప్‌కమింగ్ సినిమాలపై స్పందించిన అనన్య పాండే.. తదుపరి ప్రాజెక్ట్‌ల విషయంలో ఎంతో ఆనందంగా ఉన్నానని పేర్కొంది. విజయ్‌ దేవరకొండ-పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో రానున్న ఫైటర్ షూటింగ్ ఓ విభిన్నమైన ప్రపంచం అని, అక్కడ చాలా నేర్చుకున్నానని తెలిపింది. అలాగే దీపికా పదుకొణె, సిద్దార్థ్‌ చతుర్వేది కీలకపాత్రల్లో నటిస్తున్న ఓ సినిమాలో భాగం అవుతుండటం సంతోషంగా ఉందని.. ఇటీవల జరిగిన గోవా షెడ్యూల్‌ బాగా ఎంజాయ్‌ చేశానని చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/36eeXYE

No comments:

Post a Comment

'Don't Involve My Family!'

'My weakness is my family, and the people I love.' from rediff Top Interviews https://ift.tt/2lOucDz