Saturday 28 November 2020

ఏది నిజం ఏది అబద్దం? మ‌న‌ల్ని ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నారు.. ఉదయభాను ఎమోషనల్ కామెంట్స్

యాంకర్ .. తెలుగు ప్రేక్షకులకు పరిచయమే అక్కర్లేని పేరిది. బుల్లితెర యాంకర్, హోస్ట్, సినీ నటిగా ఆమె ప్రతిఒక్కరికీ సుపరిచితం. యాంకర్‌గా మాటల తూటాలు పేల్చుతూ ఆకట్టుకునే ఉదయభాను.. ఎప్పటికప్పుడు సమాజ పరిస్థితులు, నిజ జీవిత అంశాలపై స్పందిస్తూ ఉంటుంది. సోషల్‌ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటూ తన అభిప్రాయాలను చెబుతూ ఉంటుంది. తాజాగా జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ ఓటు యొక్క విలువను తెలుపుతూ జనాన్ని ఎడ్యుకేట్ చేసింది ఉదయభాను. ఈ మేరకు ఆమె విడుదల చేసిన వీడియో, అందులో ఆమె మాట్లాడిన విధానం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఆలోచింపజేస్తున్నాయి. గ్రేటర్‌ పోరులో వినియోగంపై ఎంతో అద్భుతమైన సందేశమిచ్చింది ఉదయభాను. ప్రజాస్వామ్య దేశంలో ఓటును అమ్ముకుంటే జరిగే పరిణామాలపై తనదైన శైలిలో వివరించింది. జీవితం ఒక యుద్ధమైతే దాన్ని గెలవడానికి మనకున్న ఆయుధం ఓటు హక్కు అని, దాన్ని నిర్వీర్యం చేయొద్దని పేర్కొంటూ చక్కని తెలుగు భాషలో సూటిగా మాట్లాడింది. ప్రలోభాల కోసం కాదు.. ప్రగతి కోసం ఓటేద్దామని పిలుపునిచ్చింది. ''అభివృద్ధి జరిగిందా? అవినీతి పెరిగిందా..? కళ్లారా చూస్తున్నాం.. చెవులారా వింటున్నాం. సామాన్యుడి స్వప్నం సాకారమయ్యిందా అంటే మాహానేతలంతా మహా అద్భుతంగా మాట్లాడతారు. ఎవ‌రి మీడియా వారిది, ఎవ‌రి మాధ్య‌మాలు వారివి. మాట‌ల గార‌డీ, అంకెల గార‌డీతో మ‌న‌ల్ని ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నారు. ఏది నిజం? ఏది అబ‌ద్ధం? ఈ ప్ర‌శ్న‌కు వేరే ఎక్క‌డో వెతుక్కోవాల్సిన అవ‌స‌రం లేదు. మ‌న జీవితాలే సాక్ష్యం. స‌మాధానం మ‌న మ‌న‌స్సాక్షికి బాగా తెలుసు. జీవితం ఒక యుద్ధ‌మైతే, దాన్ని గెల‌వ‌డానికి మ‌న‌కున్న ఆయుధం ఓటు హ‌క్కు. దాన్ని నిర్వీర్యం చేయొద్దు. క‌చ్చితంగా ఓటు వేసి తీరుదాం. అప్పుడే ప్ర‌శ్నించ‌గ‌లం. పిడికిలి ఎత్త‌గ‌లం. మన ఓటు హక్కును వందలు, వేలు వెదజల్లు కొంటున్నారంటే లక్షణంగా లక్షలు లక్షలు దోచేస్తారు. కోటాను కోట్లు దర్జాగా దోచేస్తారు. రాబడి ఉంటేనే కదా.. పెట్టుబడి పెట్టేది. కానీ అది దానం కాదు. మన మన స్వేదం, మన రుధిరం, మన భారతావని భవితం. కావున‌ ప్ర‌లోభాల కోసం కాదు ప్ర‌గ‌తి కోసం ఓటేద్దాం. ప్ర‌జాస్వామ్నాన్ని కాపాడుకుందాం'' అంటూ ఉదయభాను చెప్పిన మాటలు ఎన్నో మెదళ్లను కదలిస్తున్నాయి. Also Read:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/37ewoYw

No comments:

Post a Comment

'Don't Involve My Family!'

'My weakness is my family, and the people I love.' from rediff Top Interviews https://ift.tt/2lOucDz