‘కోరుకున్న ప్రియుడు’ సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చాడు వడ్డే నవీన్. నిర్మాత వడ్డే రమేష్ వారసుడిగా తెరంగ్రేటం చేసిన ఆయన హీరోగా అనేక సినిమాల్లో నటించారు. అయితే ఆయనకు బ్రేక్ ఇచ్చిన సినిమా మాత్రం ‘పెళ్లి’. ఆ తర్వాత మనసిచ్చి చూడు, మా బాలాజీ, ప్రేమించే మనసు, చాలా బాగుంది లాంటి సినిమాలతో విజయాలు అందుకుని తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. అయితే కెరీర్లో ఎంత వేగంగా ఎదిగాడో అంతకంటే వేగంగా డౌన్ అయిపోయాడు నవీన్. Also Read: సుమారు 28 సినిమాల్లో హీరోగా నటించిన ఆయన అవకాశాలు తగ్గిపోవడంతో రెండు మూడు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించాడు. అవికూడా పరాజయం పాలుకావడంతో ఆయన్ని పట్టించుకునేవారు లేకుండా పోయారు. ఆయన నందమూరి కుటుంబానికి అల్లుడని చాలామందికి తెలియదు. వడ్డే రమేష్, నందమూరి కుటుంబాల మధ్య ఎప్పటినుంచో సాన్నిహిత్యం ఉండేది. దీంతో ఎన్టీఆర్ కుమారుడు రామకృష్ణ కూతురైన చాముండేశ్వరిని నవీన్ పెళ్లాడాడు. అయితే కుటుంబ కలహాల కారణంగా కొన్నాళ్లకే వారిద్దరు విడాకులు తీసుకున్నారు. ఆ ప్రభావం కెరీర్‌పై పడటంతోనే నవీన్ సినిమాలకు దూరం కావాల్సి వచ్చిందని అప్పట్లో ప్రచారం జరిగింది. ఓ ఇంటర్వ్యూ సందర్భంగా ఈ విషయంపై స్పందించిన వడ్డే నవీన్.. ఈ ప్రచారాన్ని కొట్టి పడేశారు. విడాకుల కారణంగా కొంతకాలం సినిమాలకు తానే దూరమయ్యానని, ఆ తర్వాత అవకాశాలు రాలేదని చెప్పారు. 2016లో రామ్‌గోపాల్ వర్మ, మంచు మనోజ్ కాంబినేషన్లో వచ్చిన ‘ఎటాక్’ సినిమాలో నవీన్ చివరిగా కనిపించారు. మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్న ఆయన ప్రస్తుతం భార్య, పిల్లలతో కలిసి హాయిగా జీవిస్తున్నారు. ఇటీవలే ఆయన కొడుక్కి నిర్వహించిన పంచెకట్టు కార్యక్రమంలో సెలబ్రెటీలందరూ హాజరయ్యారు. Also Read:
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3fFTsDg
No comments:
Post a Comment