చాలా మంది నటులు తాము డాక్టర్ కావాలనుకుని యాక్టర్ అయ్యామని చెబుతుంటారు. కానీ మాత్రం డాక్టర్ అయ్యాకే యాక్టర్‌గా మారారు. తమిళ కుటుంబానికి చెందిన రాజశేఖర్ 1962, ఫిబ్రవరి 4న తమిళనాడులోని తానే జిల్లాలోని లక్ష్మీపురంలో జన్మించారు. ఆయన తండ్రి ఓ పోలీసు. దీంతో తాను కూడా పోలీస్ కావాలని రాజశేఖర్ అనుకునేవారట. అయితే తండ్రి ప్రోత్సాహంతో డాక్టర్ కోర్సు చదివారు. అయితే కాలేజీలో చదువుతున్న సమయంలో.. నువ్వు చాలా బాగుంటావు.. హీరోగా ప్రయత్నించొచ్చు కదా అని స్నేహితులు ప్రోత్సహించేవారట. దీంతో సినిమాలపై ఆసక్తి పెంచుకున్న ఆయన హీరో కావాలనుకున్నారు. దీంతో ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో ట్రైనింగ్ కోసం దరఖాస్తు చేశారు. అదే సమయంలో ఎమ్మెస్ సీటు రావడంతో దాన్ని వదులుకుని మరీ సినిమాల్లోకి వచ్చారు.
ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ పొందుతున్న సమయంలోనే ప్రసిద్ధ దర్శకుడు భారతీరాజా తాను తీయబోయే సినిమాలో కొత్త హీరో కోసం వెతుకుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న రాజశేఖర్ ఆయన్ని కలుసుకుని తన టాలెంట్ చూపించి ఛాన్స్ కొట్టేశారు. అయితే ఆ సినిమా సెట్స్‌పైకి వెళ్లేందుకు చాలా సమయం పట్టింది. ఈలోగా ఓ కొత్త దర్శకుడు రాజశేఖర్‌ని కలిసి కథ వినపించగా ఆయనకు నచ్చిందట. దీంతో భారతీరాజాకు అసలు విషయం చెప్పగా నీ ఇష్టమని చెప్పారట. Also Read: దీంతో రాజశేఖర్ ఆ కొత్త దర్శకుడితో సినిమా మొదలుపెట్టి.. కొద్దిరోజుల తర్వాత భారతీరాజాను కలిశారు. సినిమా ఎప్పుడు మొదలుపెడదామని ఆయన్ని అడగ్గా ‘నేను కొత్త హీరోతో సినిమా చేద్దామనుకున్నాను. కానీ ఇప్పుడు నువ్వు కొత్త హీరోవి కాదు’ అని చెప్పేశారట. దీంతో మనస్తాపం చెందిన రాజశేఖర్ అక్కడి నుంచి నిరాశగా వెనుదిరిగారు. కొద్దిరోజుల తర్వాత భారతీరాజా ఆయన్ని పిలిచి అదే సినిమాలో విలన్ వేషం ఇచ్చారు. ఈ సినిమా విజయం సాధించడంతో రాజశేఖర్‌కు తమిళంలో అవకాశాలు పెరిగాయి. మరోవైపు ఇదే సినిమా తెలుగులో ‘అరుణ కిరణం’ పేరుతో రీమేక్ చేయగా రాజశేఖర్ హీరోగా టాలీవుడ్‌కు పరిచయమయ్యారు. Also Read: ఆ తర్వాత ‘అంకుశం’ సినిమాలో పవర్‌ఫుల్ పోలీసాఫీసర్‌గా విశ్వరూపం చూపించిన రాజశేఖర్ తెలుగులో అగ్రహీరోగా ఎదిగారు. ముఖ్యంగా పోలీసు కథలంటే దర్శక నిర్మాతలు ఆయన్నే ఫస్ట్ ఛాయిస్‌గా ఎంచుకునేవారు. అలా వరుస సినిమాలు చేస్తూ తెలుగు చిత్ర పరిశ్రమలో స్థిరపడిపోయారు. ఈ క్రమంలోనే హీరోయిన్ జీవితలో ప్రేమలో పడి 1991లో ఆమెను వివాహం చేసుకున్నారు. వీరికి శివానీ, శివాత్మిక అనే ఇద్దరు కుమార్తెలున్నారు. మధ్యలో వరుసగా సినిమాలన్నీ ప్లాఫులు కావడంతో రాజశేఖర్ ఆర్థికంగా ఇబ్బంది పడ్డారు. దీనికి తోడు సొంతంగా నిర్మించిన సినిమాలు కూడా ఆయనకు నష్టాలనే మిగిల్చాయి. ఈ ఆర్థిక కష్టాల నుంచి బయటపడేందుకు చెన్నైలో తనకున్న రెండిళ్లను ఆయన అమ్మేశారని తెలిసిన వాళ్లు చెబుతుంటారు. కొంతకాలం తర్వాత ‘ఎవడైతే నాకేంటి’ సినిమాతో బ్లాక్‌బస్టర్ అందుకున్న రాజశేఖర్ టాలీవుడ్‌లో మళ్లీ పుంజుకున్నారు. గరుడవేగ, కల్కి చిత్రాలు ఆయన మార్కెట్‌ని పెంచాయి. ఇటీవలే కరోనా బారిన పడి కోలుకున్న ఆయన మళ్లీ మేకప్ వేసుకునేందుకు ఉత్సాహపడుతున్నారు. Also Read:from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2JjX55B
No comments:
Post a Comment