Saturday, 28 November 2020

శ్వేత దుస్తుల్లో దేవకన్యలా మెరిసిపోతున్న ప్రగ్యా జైస్వాల్..

‘కంచె’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది . అనంతరం నాగార్జున సరసన ‘ఓం నమో వేంకటేశాయ’ చిత్రంలో మెరిసింది. తన అందాలు ఎంతగా ఆరబోసినా ఆమె నటించిన సినిమాలన్నీ ప్లాఫ్ కావడంతో అవకాశాలు తగ్గిపోయాయి. ఇదే సమయంలో బోయపాటి శ్రీను, నందమూరి బాలకృష్ణ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాలో ప్రగ్యా ఛాన్స్ దక్కించుకుంది. ఈ సినిమాలో ముందుగా సాయేషా సైగల్‌ని అనుకున్నప్పటికీ కొన్ని కారణాలతో ఆమె ప్రాజెక్టు నుంచి తప్పుకుంది. దీంతో ఈ అవకాశం ప్రగ్యాకు దక్కింది. బోయపాటి డైరెక్షన్లో వచ్చిన ‘జయ జానకీ నాయక’ సినిమాలోనూ ఓ కీలక పాత్రలో ప్రగ్యా నటించింది. ఆ పరిచయంతోనే బోయపాటి తన నెక్ట్స్ సినిమాలో ఆమెకు ఛాన్స్ ఇచ్చాడట. సోషల్‌మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ప్రగ్యా జైస్వాల్ తన ఫోటోలను పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్‌ను అలరిస్తూ ఉంటుంది. తాజాగా తెల్లటి దుస్తుల్లో మెరిసిపోతూ ఆమె దిగిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు నిజంగానే దేవకన్యలా ఉన్నావంటూ తెగ పొగిడేస్తున్నారు. Also Read:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3o5b3aI

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....