Wednesday 25 November 2020

వద్దని ఎంత చెప్పినా వినలేదు.. చివరకు ఆ పని చేసి నాతో ఓకే అనిపించుకుంది.. నిహారికపై నాగబాబు కామెంట్స్

మెగా బ్రదర్ తన సొంత యూట్యూబ్ ఛానల్ ద్వారా పలు అంశాలపై స్పందిస్తూ ఎంతో విలువైన సమాచారాలు ఇస్తున్నారు. ఏదైనా ఓపెన్‌గా మాట్లాడే ఆయన.. అటు మనీ సిరీస్‌తో పాటు ఇటు కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి తెలుపుతూ ఎడ్యుకేట్ చేస్తున్నారు. 'మన ఛానల్ మన ఇష్టం' అంటూ నిత్యం ఏదో ఒక టాపిక్‌పై మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా పిల్లలతో తల్లిదండ్రులకు ఎలాంటి రిలేషన్, కమ్యూనికేషన్ ఉండాలో పేర్కొంటూ తన కూతురు విషయాన్ని ప్రస్తావించారు నాగబాబు. ప్రతి రిలేషన్‌లో కమ్యూనికేషన్ చాలా ముఖ్యమని తెలిపిన నాగబాబు.. కుటుంబంలో పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఎలా బిహేవ్ చేయాలో చెప్పుకొచ్చారు. తన కూతురు నిహారిక పదో తరగతిలో ఓ టూర్‌కి వెళ్తానని పట్టుబట్టిన సందర్భాన్ని వివరిస్తూ పిల్లలకు తల్లిదండ్రులతో కమ్యూనికేట్ చేసే ఫ్రీడమ్ ఇవ్వాలని అన్నారు. పదో తరగతి చదువుతున్న సమయంలో నిహారిక.. తన స్నేహితులు, టీచర్లతో ఉత్తరాంచల్ టూర్ వెళ్తానని మంకు పట్టు పట్టి తనతో ఎలా ఒప్పించిందో చెబుతూ నాగబాబు ఓపెన్ అయ్యారు. Also Read: నిహారిక వెళ్లాలనుకుంటున్న టూర్ పది రోజులని తెలిసి చాలా భయపడటమే గాక అస్సలు వద్దని వారించానని, కానీ నిహారిక మాత్రం ఎంత చెప్పినా వినలేదని నాగబాబు చెప్పారు. చివరకు నిహారిక వెంట బాడీగార్డ్స్‌ను పంపిద్దామని ఫిక్సయినా దానికీ ఆమె నో చెప్పిందని.. ఆ మరుసటి రోజు ఉదయాన లేచేసరికి తన ముందు ఆమె ఓ లెటర్ పెట్టిందని, అందులో ముద్దు ముద్దుగా ఆమె వ్యక్తపరిచిన విషయాలు తనతో ఓకే చెప్పించాయని నాగబాబు అన్నారు. ''నా స్నేహితుల ఫోన్ నెంబర్లు, టీచర్ల నెంబర్లు ఇస్తా. అలాగే రోజూ మూడు నాలుగు సార్లు ఫోన్ చేసి మాట్లాడుతుంటా. ఎక్కడికి వెళ్లినా లొకేషన్ చెబుతా. సిగ్నల్ లేకపోయినా ఎలాగైనా సరే ఫోన్ చేస్తాను.. ప్లీజ్ వెళ్లనివ్వు నాన్నా..'' అంటూ ఆ లెటర్‌పై నాగబాబుకు ఇష్టమైన తన ఫోటోలను పెట్టి ఐస్ చేసిందట నిహారిక. ఆ రకంగా తల్లిదండ్రులు తమ తమ పిల్లలకు ఫ్రీడమ్ ఇవ్వాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ పిల్లలను కొట్టకూడదని నాగబాబు తెలిపారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2V1Wb0n

No comments:

Post a Comment

'Don't Involve My Family!'

'My weakness is my family, and the people I love.' from rediff Top Interviews https://ift.tt/2lOucDz