జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో పేరు మరోసారి సెన్సేషన్ అవుతోంది. ఏదో ఒకరకంగా ఆయన పేరు ప్రస్తావనలోకి వస్తుండటం గమనిస్తున్నాం. ఇటీవల ఎన్నికల ప్రచారంలో భాగంగా టీఆర్ఎస్ నిర్వహించిన ఓ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ .. ఒకానొక సందర్భంలో బండ్ల గణేష్ పేరు తీయడంతో ఆ వీడియో వైరల్ అయింది. గత సంవత్సరం బండ్ల గణేష్ చేసిన కామెడీలా ఈ సంవత్సరం బండి సంజయ్ చేస్తున్నారంటూ ఆమె సందేశమివ్వడం జనాల్లో చర్చనీయాంశం అయింది. ఈ నేపథ్యంలో తాజాగా కవిత కామెంట్‌పై రియాక్ట్ అయ్యారు బండ్ల గణేష్. ''నేను జోకర్‌ని కాదు.. ఫైటర్‌ని.. కానీ ప్రస్తుతం ఎలాంటి రాజకీయ పార్టీలో ఉండదలచుకోలేదు. ఆల్ ది బెస్ట్'' అని పేర్కొంటూ కవితకు ట్యాగ్ చేశారు. ఆయన చేసిన ఈ కామెంట్ చూసి.. బండ్లన్నకు మద్దతుగా భిన్న రకాలుగా స్పందిస్తున్నారు నెటిజన్లు. దీంతో ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. Also Read: తనకు రాజకీయాలతో సంబంధం లేదు మొర్రో అని మొత్తుకుంటున్నా కొందరు పనిగట్టుకుని మరీ ఆయనపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో పదే పదే తాను ఏ రాజకీయ పార్టీలో లేనని చెప్పుకొస్తున్నారు బండ్ల గణేష్. దయచేసి గతంలో మాట్లాడిన మాటల్ని ఇప్పుడు పోస్ట్ చేయొద్దని ఒకటికి పది సార్లు అభ్యర్థిస్తుండటం గమనార్హం. ఇకపోతే రీసెంట్‌గా 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో నటించిన బండ్ల గణేష్.. తిరిగి నిర్మాతగా పలు సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/37htNgb
No comments:
Post a Comment