బుల్లితెరపై మంచి జోష్‌లో ఉన్న జబర్దస్త్ బ్యూటీ .. మరోసారి వెండితెర విందివ్వడానికి రెడీ అయింది. ప్రస్తుతం ఈ హాట్ యాంకర్ '' సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా పనులు చివరిదశకు చేరుకున్న నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్‌పై దృష్టి పెట్టిన చిత్రయూనిట్ వరుస అప్‌డేట్స్ ఇస్తూ సినిమాపై హైప్ క్రియేట్ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే అక్టోబర్ 2న చిత్ర టీజర్ మీ ముందుకు తెస్తున్నామని, 'దద్దరిల్లకపోతే నన్ను అడగండి.. మార్కెట్‌లో మతి పోవాలి' అని పేర్కొన్న రష్మీ.. అన్నంత పని చేసింది. తాజాగా విడుదల చేసిన 'బొమ్మ బ్లాక్‌బస్టర్' టీజర్‌తో బొమ్మ దద్దరిల్లిపోయింది. 2 నిమిషాల 6 సెకనుల నిడివితో కట్ చేసిన ఈ టీజర్‌లో ఆసక్తికర సన్నివేశాలు చూపించారు. డైరెక్టర్ పూరి జగన్నాథ్ అంటే పడిచచ్చిపోయే యువకుడిగా హీరో నందు అభినయం సినిమాకే మేజర్ హైలైట్ కానుందని టీజర్ చూస్తుంటే స్పష్టంగా తెలుస్తోంది. ''నందు గాడి జీవితకథను పూరి రూపొందించాలి అనేదే అతగాడి నిర్ణయం'' అనే పాయింట్ బాగా అట్రాక్ట్ చేస్తోంది. ఈ టీజర్ చూసి రియల్లీ బొమ్మ బ్లాక్‌బస్టర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఇందులో పోతురాజుగా హీరో నందు, పోతురాజు గాడి లవర్ వాణిగా హీరోయిన్ రష్మీ విలక్షణ పాత్రలు పోషిస్తున్నారు. Also Read: విజయీభవ ఆర్ట్స్ పతాకంపై ప్రవీణ్ పగడాల, బోస్ బాబు నిడిమోలు, ఆనంద్ రెడ్డి నిర్మాణంలో రూపొందుతున్న ఈ 'బొమ్మ బ్లాక్‌బస్టర్' సినిమాకు రాజ్ విరాఠ్ దర్శకత్వం వహిస్తున్నాడు. నందు, రష్మీ గౌతమ్ జంటగా నటిస్తున్నారు. ఇటీవలే ఈ మూవీ ఫస్ట్‌లుక్ విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్న చిత్రయూనిట్ అతిత్వరలో ఈ మూవీ రిలీజ్ డేట్ ప్రకటించనుంది.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2Sizrrn
No comments:
Post a Comment