ఈ లాక్‌డౌన్ సమయాన్ని మరోరకంగా వినియోగించుకుంటూ సంచలనం సృష్టిస్తున్నారు డాషింగ్ డైరెక్టర్ . పోడ్ కాస్ట్ ఆడియోల రూపంలో తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా చెబుతూ ఆలోచనలు రేకెత్తిస్తున్నారు. ఈ సమాజంలోని అన్ని అంశాలపై స్పందిస్తూ 360 డిగ్రీస్ కోణంలో తన వివరణ ఇస్తున్నారు. దేశ విదేశాల సంస్కృతీ సంప్రదాయాలు మొదలుకొని యువకులకు మోటివేషన్ వరకు అన్నింటిపై రియాక్ట్ అవుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మ్యారేజ్ టాపిక్ తీసుకొని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు పూరి. లేటెస్ట్ పోడ్ కాస్ట్ ఆడియోలో పూరి జగన్నాథ్ మాట్లాడుతూ.. ''మ్యారేజ్ అనే దానికి పోయేకాలం దగ్గరకొచ్చింది. మ్యారేజ్ అంత మంచిదే అయితే యేసు క్రీస్తు 10 పెళ్లిళ్లు చేసుకునేవాడు. ఉన్న పెళ్ళాన్ని వేదిలేయడం వల్లే ఆ రాజుల కుర్రాడు బుద్ధుడయ్యాడు. మీ ఆలోచనలు గొప్పగా ఉంటే అస్సలు పెళ్లి చేసుకోవద్దు. ఎవ్వరికీ తాళి కట్టొద్దు. లైఫ్‌లో ఏదైనా చేయాలి.. ప్రపంచమంతా తిరగాలి అనే పట్టుదల, కసి గనక మీలో ఉంటే మీ కాళ్ళకి పారాణి మాత్రం రాయొద్దు. Also Read: ఎలాగూ నేను బుర్రతక్కువ వెధవనే. పాప, బాబుతో ఆడుకుంటా.. వర్షంలో మా ఆవిడ పకోడీలు వేస్తుంటే తింటా, టీవీలో సీరియల్స్ చూస్తా లాంటి ఆలోచనలు మీలో ఉంటే వెంటనే మీ వెడ్డింగ్ కార్డు పంపండి. వచ్చి ఆశీర్వదిస్తా. మనలాంటి పిట్ట బ్రెయిన్ ఉన్నవాళ్లే పెళ్లి చేసుకుంటారు. జీనియస్‌లు ఎవ్వరూ పెళ్లి చేసుకోరు. పెళ్లి చేసుకోవడం తప్పు అని ఏ మతమూ చెప్పదు. చెప్తే ఆ మతం ఎగిరిపోద్ది. పెళ్లి చేసుకోకపోతే గుడికి వెళ్లే పనుండదు.. పూజలు, వ్రతాలు కట్. ఫైనల్‌గా దేవుడితో కనెక్షన్ కట్ అవుతుంది. అందుకే వాళ్ళు పెళ్లి గురించి నిజాలు చెప్పరు. Also Read: గుర్తుపెట్టుకో.. పెళ్లైన వాళ్లంతా పెళ్లికాని బాబాల కాళ్ళ మీదే పడతారు. పెళ్లికాని హీరోయిన్‌కి ఉన్న ఫాలోయింగ్ పెళ్లి చేసుకున్న హీరోయిన్‌కి ఉండదు. అందుకే మిమ్మల్ని మీరు తాడేసుకు కట్టేసుకోకండి. పెళ్లి చేసుకోమని ఇంట్లో మీ నాన్న గానీ ఒత్తిడి చేస్తే ఆయనే పెళ్లి చేసేయ్.. దూల తీరుద్ది. మీ అమ్మమ్మ అడిగితే దానికీ చేసేయ్. నువ్వు మాత్రం చేసుకోవద్దు'' అన్నారు. దీంతో పూరి యాంటీ మ్యారేజ్ టిప్స్ నెట్టింట వైరల్ అవుతూ నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన పొందుతున్నాయి.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/30pGLGj
No comments:
Post a Comment