చెన్నై నుంచి తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది నటి . కమెడియన్‌గా సత్తా చాటుతూ కామెడీ చేయడంలో తనది ఓ స్పెషల్ వే అని నిరూపించుకున్న ఆమె.. ఫీమేల్ కేటగిరీలో నంది అవార్డును సైతం సొంతం చేసుకుంది. అయితే ఈ లాక్‌డౌన్ వేళ ఉన్నట్టుండి ఈ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ నిశ్చితార్థం చేసుకొని సర్‌ప్రైజ్ చేసింది. అంతేకాదు బొద్దుగా ఉండే విద్యుల్లేఖ దాదాపు 20 కిలోల బరువు తగ్గి ఆశ్చర్యపరిచింది. తాజాగా ఈ విశేషాలను పంచుకుంటూ మీడియాతో ముచ్చటించింది ఈ లేడీ కమెడియన్. తన ప్రియుడి సంజయ్‌తో సీక్రెట్‌గా రోకా వేడుక ఫినిష్ చేసుకున్న విద్యుల్లేఖ రామన్.. ఆ వేడుక జరిగిన 5 రోజుల తర్వాత విషయాన్ని బయటపెట్టింది. లాక్‌డౌన్ నిబంధనలకు లోబడి నిశ్చితార్థం చేసుకున్నామని, ఈ వేడుకకు కేవలం సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరైనట్లు పేర్కొంటూ తనకు కాబోయేవాడి ఫోటోలను పోస్ట్ చేసింది. ఈ క్రమంలోనే లేటెస్ట్ ఇంటర్వ్యూలో సంజయ్‌తో ప్రేమ, వ్యక్తిగతంగా అతను ఎలాంటి వాడు? అనే అంశాలపై స్పందించింది విద్యుల్లేఖ. Also Read: తనకు కాబోయే భర్త సంజయ్‌తో ఒక సంవత్సర కాలంగా ట్రావెల్ చేస్తున్నానని, 2020లో ఎంగేజ్‌మెంట్, 2021లో మ్యారేజ్ అని తామిద్దరం చాలారోజుల క్రిందటే ప్లాన్ చేసుకున్నామని చెప్పింది విద్యుల్లేఖ. తమ ప్రేమ వ్యవహారంలో ముందుగా ఎవరు ప్రపోజ్ చేశారనే విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఫస్ట్ సంజయే తనకు ప్రపోజ్ చేశాడని చెప్పింది. అతను నార్త్ ఇండియన్ అబ్బాయి అని, తెలుగు సినిమా ఇండస్ట్రీలో తాను ఎలాంటి పాత్రలు చేస్తానో కూడా అతనికి తెలియదని పేర్కొంది. ''మొదటిసారి మేమిద్దరం కలిసినపుడు నా గురించి అతనికి ఏమీ తెలియదు. అతనిలో నాకు అదే నచ్చింది. సాధారణంగా అలాంటి సందర్భంలో ఎవ్వరైనా.. మీరు మంచి నటి, ఫేమస్, బ్యూటిఫుల్ అంటూ ఆకాశానికెత్తుతారు. కానీ సంజయ్ అలా చేయలేదు. అదే తనలో ప్రేమ పుట్టించింది'' అని విద్యుల్లేఖ తెలపడం విశేషం. ఇకపోతే సంజయ్‌ని కలవక ముందే తన వెయిట్ లాస్ జర్నీ మొదలైందని, వెయిట్ తగ్గడానికి అతను కూడా కొన్ని టిప్స్ చెప్పాడని ఆమె చెప్పుకొచ్చింది.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/30omVLC
No comments:
Post a Comment