Friday, 2 October 2020

‘కళాపోషకులు’ రెడీ అయ్యారు.. ఇక థియేటర్లలో హంగామే

శ్రీ వెన్నెల క్రియేషన్స్ పతాకంపై విశ్వకార్తికేయ, దీప ఉమావతి జంటగా తెరకెక్కిన సినిమా ‘’. షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘ఆ నలుగురు’లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించిన విశ్వకార్తికేయ ఈ చిత్రం ద్వారా హీరోగా పరిచయం అవుతున్నాడు. ఈ సందర్భంగా నిర్మాత ఏమ్.సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ... 'కళాపోషకులు' చిత్రాన్ని దర్శకుడు చలపతి పువ్వుల బాగా తెరకెక్కించాడు. మహావీర్ సంగీతం అందించిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు అలరించే విధంగా ఉండబోతోంది. నటీనటులు అందరూ బాగా చేశారు. కోవిడ్-19 లాక్‌డౌన్ తర్వాత ప్రభుత్వ సూచనలు, చిత్రసీమ పెద్దల సలహాలు పాటిస్తూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా షూటింగ్‌ దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాం. దీనికి సహకరించిన అందరికీ ధన్యవాదాలు చెబుతున్నా’ అని అన్నారు. ‘నిర్మాత సుధాకర్ రెడ్డి ఎక్కడా రాజీపడకుండా ఈ సినిమాను నిర్మించారు. హీరో విశ్వ కార్తికేయ బాగా చేశాడు. ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉంటుంది. కల్యాణ్ సమి కెమెరా వర్క్, ఎలెందర్ మహావీర్ సంగీతం ఈ సినిమాకు అదనవు ఆకర్షణ కానుంది’.. డైరెక్టర్ చలపతి పువ్వల తెలిపారు. బ్యానర్: శ్రీ వెన్నెల క్రియేషన్స్ నటీనటులు: విశ్వకార్తికేయ, దీప ఉమాపతి, చైతన్య, చిన్ను, కృష్ణవేణి, అనంత్, జెమిని సురేష్, నవీన్ సంతోష్, మహేష్ తదితరులు కెమెరామెన్: కళ్యాణ్ సమి ఎడిటర్: సెల్వ కుమార్ సంగీతం: ఎలేందర్ మహావీర్ డిజైన్: గణేష్ పీఆర్ఓ: సాయి సతీష్ నిర్మాత, కథ: సుధాకర్ రెడ్డి. ఎమ్ స్క్రీన్‌ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్: చలపతి పువ్వల


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2Sm32Ao

No comments:

Post a Comment

'We Will Also Make Waves One Day'

'When you are in new waters, you have to follow the rules of that water.' from rediff Top Interviews https://ift.tt/8vDaJRw