కామెడీ షోలో జబర్దస్త్ నవ్వులకు కొదువే ఉండదు.. అల్టిమేట్ ఫన్ అందించే క్రమంలో ఒక్కోసారి హద్దులు మీరుతుంటారు. కామెడీ స్కిట్లు ఎంతలా పేలతాయో అతని అతని స్కిట్‌లలో డబుల్ మీనింగ్ డోస్ కూడా అదే రేంజ్‌లు ఉంటుంది. ఎవర్నొకర్ని ఇమిటేట్ చేయడం.. హేళన చేయడం.. డబుల్ మీనింగ్ డైలాగ్‌లు, బాడీ షేమింగ్, బూతులకు కేరాఫ్ అడ్రస్ అయ్యాడు హైపర్ ఆది. తాజాగా వచ్చే వారానికి సంబంధించిన జబర్దస్త్ ప్రోమో విడుదల చేయగా ఇందులోనూ మంచి మసాలా దట్టించి మరీ డబుల్ మీనింగ్ డైలాగ్‌లు వదిలాడు హైపర్ ఆది. తాజా ప్రోమో.. బిచ్చగాడి అవతారం ఎత్తాడు హైపర్ ఆది.. ఈ ప్రపంచంలో ఆడుక్కోనిది ఎవరు?? వాళ్లు (జడ్జీ) కామెడీ పెంచమని అడుక్కుంటారు.. మనం పేమెంట్లు పెంచమని అడుక్కుంటాం.. ఆవిడ (అనసూయ) క్లోజ్‌లు పెంచమని అడుక్కుంటుంది.. పక్క షో వాళ్లు మా షోకి రండి అని అడుక్కుంటారు.. మీరు ఎవరికీ లొంగకండి అని వీళ్లు (మల్లెమాల) అడుక్కుంటారు.. మీరు మీరు కలిసి మమ్మల్ని మింగకండి అని మనం అడుక్కుంటాం’ అంటూ ద్వందార్థం వచ్చే డైలాగ్ వేశాడు ఆది. ఇక ఆదికి భార్య గెటప్‌లో వచ్చిన శాంతి స్వరూప్.. ‘ఈ మధ్య ఎవరూ డబ్బులు వేయడం లేదండీ.. మనో గారిని అడిగితే ఇవ్వనన్నాడు’ అని అనడంతో.. నువ్ ఏమి అడిగావో అతను ఏం ఇవ్వనన్నాడో అంటూ డబుల్ మీనింగ్ డోస్ పెంచాడు ఆది. ‘రోజా గారిని కూడా పది అడిగా.. ఇవ్వనన్నారు.. అప్పుడు అమ్మా అని అరిచినా ఇవ్వలేదండీ’ అని శాంతి స్వరూప్ అనడంతో.. ‘ఇద్దరు పిల్లలున్నా.. అమ్మా అంటే ఒప్పుకోదు అమ్మాయి అనాలి’ అంటూ రోజాపై పంచ్ వేశాడు ఆది. చిన్నప్పుడు జాతకం చెప్తే.. జనాల్లోకి వెళ్తావ్ అన్నాడు.. నేను ఏ ఓట్లు ఆడుక్కోవడానికో అనుకున్నా.. వంకాయ కూర అడుక్కుంటున్నా.. హైపర్ పంచ్‌లు వేశాడు ఆది. ఇక ఇదే స్కిట్‌లోకి దొరబాబు జతకావడంతో ఫన్ రెట్టింపు అయ్యింది.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2GvKL0y
No comments:
Post a Comment